జీ తెలుగు అందిస్తున్న వినాయక చవితి స్పెషల్​ ఈవెంట్​ RRR​ గణేశా.. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు!

-

హైదరాబాద్, 05 సెప్టెంబర్​ 2024: ఫిక్షన్​, నాన్​-ఫిక్షన్​ షోలతో నిరంతం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే ఛానల్​ జీ తెలుగు. పండుగల వేళ రెట్టింపు వినోదంతో అలరించే జీ తెలుగు ఈ వినాయక చవితికి మరో సరికొత్త కార్యక్రమాన్ని అందించేందుకు సిద్ధమైంది. అలనాటి తారలు రాధ, రాధిక ముఖ్య అతిథులుగా సందడి చేసిన జీ తెలుగు మెగా సంబరం RRR​ గణేశా. మీ అభిమాన నటీనటులు, ముఖ్య అతిథుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగిన వినాయక చవితి వేడుక RRR గణేశా ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో, తప్పక చూడండి!

జీ తెలుగు నటీనటులు అందరూ కలిసి ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్​ రాధ, రాధిక ముఖ్య​అతిథులుగా హాజరయ్యారు. రాధ, రాధిక గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఆద్యంతం మనసును హత్తుకునే ప్రదర్శనలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో సరదాగా సాగింది. డైలాగ్​ వార్​తో మొదటైన రాధ, రాధికల జట్ల మధ్య పోటీ అంత్యాక్షరీతో మరింత సబంరంగా కొనసాగింది.

ఆటపాటలతో పాటు, ఆకట్టుకునే స్కిట్‌తో డ్రామా జూనియర్స్​ పిల్లల ప్రదర్శన ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు, జీ తెలుగు పాపులర్​ రియాలిటీ షో ‘బ్రతుకు జట్కా బండి’ని ఈ వేదికపై మరోసారి ప్రేక్షకులకు అందించారు. ఈ కార్యక్రమంలో రాధ, రాధిక ఒక జంట మధ్య సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అంశాలను ప్రతిబింబిస్తూ, జీ తెలుగు నారి శక్తిగా దీప్తి మన్నె మహిళలకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పిస్తుంది.

అంతేకాదు జీ తెలుగు పాపులర్​ సీరియల్స్​ ‘పడమటి సంధ్యారాగం’, ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ నటుల ప్రత్యేక ప్రదర్శనలు, మ్యూజికల్ ఛైర్స్ ఆట, జుగల్బంది డాన్స్‌తో ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. ఈ వినోదభరిత కార్యక్రమాన్ని ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీరూ తప్పకుండా చూడండి!

గణేష్​ చతుర్థి ప్రత్యేక ఉత్సవం RRR​ గణేశా.. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో.. డోంట్​ మిస్​!

Read more RELATED
Recommended to you

Exit mobile version