సాధారణంగా సెలబ్రిటీలు కనిపించగానే ఫ్యాన్స్ సెల్ఫీ అడుగుతుంటారు. అయితే దాదాపు ఎక్కువగా సెలబ్రిటీలు ఫ్యాన్స్‌తో సెల్ఫీ తీసుకుని వారిని ఖుష్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు వారి మూడ్ బాలేకపోయినా.. అర్జెంట్‌గా వెళ్లాల్సి ఉన్నా సారీ అని చెప్పి వెళ్లిపోతుంటారు.
కానీ తమిళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం అలా చేయలేదు. ఒక్క సెల్ఫీ.. సర్ అని అడిగిన మహిళతో హ్యాపీగా ఫొటో దిగారు. అంతేగాకుండా.. తన బిడ్డను మోయలేక ఇబ్బంది పడుతున్న ఆ లేడీ ఫ్యాన్‌కు సాయం అందించారు. ఆమె బ్యాగ్‌ను స్వయంగా విమానం దాకా మోసుకుంటూ వెళ్లారు. ఈ ఘటన లండన్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సదరు మహిళ భర్త సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అజిత్ గొప్ప మనసును, ఆయన సింప్లిసిటీనీ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘అజిత్ సర్.. మీరు చాలా గ్రేట్’, ‘మీరు సూపర్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.