మొదటి రోజే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విరూపాక్ష..!

-

కొత్త దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మెగా మేనల్లుడు అలియాస్ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం విరూపాక్ష . బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో రియల్ గా జరిగిన ఒక కథను ఆదర్శంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిన్న ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తోందని చెప్పాలి. కేవలం విడుదల అయింది రెండు తెలుగు రాష్ట్రాలలో అయినప్పటికీ సుమారుగా రూ. 5 కోట్ల మేర మొదటి రోజు కలెక్షన్స్ వస్తువులు చేసి రికార్డు సృష్టించింది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఇందులో రాజీవ్ కనకాల , సునీల్, సాయి చంద్ర, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మేరా కలెక్షన్స్ సాధించిందో ఇప్పుడు చూద్దాం.

నైజాం – రూ.1.82 కోట్లు
వైజాగ్ – రూ. 58 లక్షలు
సీడెడ్ – రూ.54 లక్షలు
గుంటూరు – రూ.46లక్షలు
నెల్లూరు – రూ.20లక్షలు
కృష్ణ – రూ.32లక్షలు
వెస్ట్ – రూ.47లక్షలు
ఈస్ట్ – రూ.40లక్షలు

మొత్తం – రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని రూ. 4.79 కోట్లు మేరా షేర్ రాబట్టింది. ఇకపోతే యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. వాస్తవానికి యాక్సిడెంట్ తర్వాత రిపబ్లిక్ సినిమా విడుదల అయ్యింది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దాదాపు రెండు సంవత్సరాలు పాటు కష్టపడి మరి తెరకెక్కించిన విరూపాక్ష చిత్రం మాత్రం కష్టానికి తగిన ఫలితాన్ని అందించింది అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news