రివ్యూ : విశాల్ ‘యాక్ష‌న్’ విజువ‌ల్ ట్రీట్‌.. రేటింగ్‌ 3/5

-

బ్యాన‌ర్‌: శ‌్రీకార్తికేయ సినిమాస్‌
న‌టీన‌టులు: విశాల్, త‌మ‌న్నా, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, రామ్‌కీ, ఆకాంక్ష పూరి, క‌బీర్ దుహ‌న్ సింగ్, యోగిబాబు త‌దిత‌రులు
మ్యూజిక్‌: హిప్‌హాప్ త‌మిళ‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: డుడ్లీ
ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌
స్క్రీన్ ప్లే: వెంక‌ట్ రాఘ‌వ‌న్‌, సుభ, సుంద‌ర్‌.సి
నిర్మాత‌: శ్రీనివాస్ ఆడెపు
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్‌.సి
రిలీజ్ డేట్‌: 15 న‌వంబ‌ర్‌, 2019

యాక్షన్ హీరో విశాల్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. రాయుడు, డిటెక్టివ్‌, అభిమ‌న్యుడు, పందెం కోడి 2 లాంటి హిట్ల‌తో తెలుగు, త‌మిళ్‌లో మంచి జోరుమీదున్న విశాల్ తాజాగా త‌న కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన యాక్ష‌న్ సినిమాలో న‌టించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ యాక్షన్. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌ సి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు రు.60 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు ప్ర‌చారం చేశారు. ఈ రోజు తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పించిందో చూద్దాం.

Vishal Action Movie Review

కథేమిటంటే..
తెలుగు రాష్ట్రానికి ఓ ముఖ్య‌మంత్రి.. ఆ ముఖ్య‌మంత్రి పెద్ద కొడుకు రామ్ కీ (ఉప ముఖ్య‌మంత్రి).. ఆ ముఖ్య‌మంత్రి రెండో కొడుకు సుభాష్(విశాల్‌) ఓ మిల‌ట‌రీ క‌మాండ‌ర్. ఆర్మీ ఆప‌రేష‌న్ల‌లో సుభాష్ బిజీగా ఉంటాడు. త‌న పెద్ద కొడుకును ముఖ్య‌మంత్రిని చేసి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని అనుకుంటాడు సుభాష్ తండ్రి. ఈ క్ర‌మంలోనే మ‌రో పార్టీతో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకుంటాడు. ఇక సుభాష్ త‌న మ‌ర‌ద‌లు అయిన మీరా(ఐశ్వ‌ర్య ల‌క్ష్మి)ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు.

ఇలాంటి టైంలో రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఉన్న సుభాష్ అన్న‌య్య ఉరి వేసుకుని చ‌నిపోతాడు. అస‌లు సుభాష్ అన్న‌య్య ఎందుకు ఉరి వేసుకుని చ‌నిపోయాడు ? దీని వెన‌క ఎవ‌రి హ‌స్తం ఉంది ? ఈ ఘ‌ట‌న‌కు టెర్ర‌రిస్ట్ నాయ‌కుడు స‌య్య‌ద్ ఇబ్ర‌హీం మాలిక్‌(క‌బీర్ దుహ‌న్ సింగ్‌)కు ఉన్న లింక్ ఏంటి ? ఈ విష‌యాలను సుభాష్ ఎలా చేధించాడు ? సుభాష్‌ను ప్రేమించిన ఆమె తోటి ఆఫీస‌ర్ త‌మ‌న్నా ఏమైంది ? అన్న‌దే యాక్ష‌న్ స్టోరీ.

విశ్లేష‌ణ :
వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్న విశాల్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తెర‌కెక్కించే సుంద‌ర్ కాంబోలో కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా వ‌చ్చింది. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే సినిమా రేంజ్ ఏంటో చెప్ప‌క‌నే చెప్పారు. సినిమాలో మెయిన్ చాలా కామ‌న్‌గానే ఉన్నా దాని చుట్టూ అల్లుకున్న యాక్ష‌న్ స‌న్నివేశాలు.. ఆ సీన్ల‌లో విశాల్ న‌ట‌న మాత్రం మైండ్ బ్లోయింగ్‌. హై రిస్కీ ఫైట్స్ విశాల్ చాలా క‌ష్ట‌ప‌డి చేశాడు. ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే ఫైట్ కోసం విశాల్ ప‌డిన క‌ష్టాన్ని మెచ్చుకుని తీరాలి.

ఇక బాహుబ‌లి లాంటి సినిమాల్లో మిన‌హా ఎప్పుడూ గ్లామ‌ర్ పాత్ర‌లే చేసే త‌మ‌న్నా యాక్ష‌న్‌లో విశాల్‌తో క‌లిసి చేసిన సీన్లు సూప‌ర్బ్‌. విశాల్‌కు మ‌ర‌ద‌లిగా న‌టించిన ఐశ్వ‌ర్య ల‌క్ష్మి పాత్ర కూల్‌గా… డీసెంట్‌గా ఉంది. విశాల్ – ఐశ్వర్య లక్ష్మీ మధ్య లవ్ ట్రాక్, వారి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటాయి. విల‌న్‌గా టెర్ర‌రిస్ట్ నాయ‌కుడిగా న‌టించిన క‌బీర్ దుహ‌న్ సింగ్ జ‌స్ట్ ఓకే. ఆకాంక్ష పూరి కిల్ల‌ర్ లేడీగా ఆక‌ట్టుకుంది. ఆకాంక్ష సింగ్ అల్ట్రా మోడ్రన్‌గా, హాట్‌గా ఓ పాట‌లో క‌న‌ప‌డుతుంది.

టెక్నిక‌ల్‌గా చూస్తే డుడ్లీ సినిమాటోగ్ర‌ఫీ సినిమాను ఓ రేంజ్‌లో నిల‌బెట్టింది. యాక్ష‌న్ సీన్లు వ‌స్తున్న‌ప్పుడు క‌ళ్లు రెప్పార్ప‌కుండా చూసేలా ఉన్నాయి. హిప్ హాప్ పాట‌లు బాగో లేక‌పోయినా నేప‌థ్య సంగీతం బాగా కుదిరింది. పాట‌ల పిక్చ‌రైజేష‌న్ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాత ప్ర‌తీ సీన్ కోసం ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ఖ‌ర్చు పెట్టారు.

ఇక సుంద‌ర్ సి డైరెక్ష‌న్ విష‌యానికి వ‌స్తే సినిమాలో క‌థ ప‌రంగా చెప్ప‌డానికి కొత్త‌గా ఏమీ లేదు. నెట్‌ఫిక్స్‌లో వ‌చ్చే బ‌ర్డ్ ఆఫ్ బ్ల‌డ్ త‌ర‌హా కంటెంట్ క‌న‌ప‌డుతుంది. ఇటీవ‌ల వ‌చ్చిన గోపీచంద్ చాణ‌క్య సినిమా సెకండాఫ్ పోలిక‌లు ఇందులో కూడా కొన్ని చోట్ల ఉంటాయి. సినిమాను హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. సినిమా నిండా కావాల్సిన ట్విస్టులు, యాక్ష‌న్ అదిరిపోయాయి. అయితే సినిమాలో క‌థ త‌క్కువ అవ్వ‌డం యాక్ష‌న్ ఎక్కువ అవ్వ‌డం కూడా మైన‌స్‌.

ప్ల‌స్‌లు…
మైండ్ బ్లోయింగ్ యాక్ష‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ, నేప‌థ్య సంగీతం… విశాల్ – ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ కెమిస్ట్రీ, త‌మ‌న్నా గ్లామ‌ర్ షో

మైన‌స్‌లు…
కొన్ని బోరింగ్ సీన్లు.. సెంక‌డాఫ్‌లో సాగ‌దీత‌, మెయిన్ లైన్. స్లో సీన్స్‌

ఫైన‌ల్‌గా..
యాక్ష‌న్ విజువ‌ల్ ట్రీట్‌

యాక్ష‌న్ రేటింగ్‌: 3 / 5

Read more RELATED
Recommended to you

Exit mobile version