రాజకీయాల్లోకి రావడం లేదు : విశాల్ సంచలన ప్రకటన

-

స్టార్ హీరో విశాల్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు హీరో విశాల్. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్టార్ హీరో విశాల్ స్పందించారు. గత రెండు రోజులుగా హీరో విశాల్‌ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఆయన మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే.

తన అభిమాన సంఘాన్ని ‘విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం’(విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చిన విశాల్ అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించి బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే..తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్టార్ హీరో విశాల్ స్పందించారు.

‘నాకు ఇంత గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని..నాకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నానని తెలిపారు. విద్యార్థులకు చదివిస్తున్నా. రైతులకు సాయం చేశా…లాభాలను ఆశించి ఏ పనిచేయను. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కాలం నిర్ణయిస్తే, ప్రజల కోసం పోరాడుతా’నని వెల్లడించారు విశాల్‌.

Read more RELATED
Recommended to you

Latest news