Bigg Boss Telugu 8 : ఎవరు లైన్ వేస్తారంటూ.. డైరెక్ట్‌గా అతని పరువు తీసేసిన విష్ణుప్రియ..!

-

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగులో 20వ తేదీ ఎపిసోడ్ లో ప్రభావతి 2.0 టాస్క్ పూర్తయింది. ఈ టాస్కులో ఎక్కువ గుడ్లు సాధించిన నిఖిల్ క్లాన్ గెలిచింది. రెడ్ కలర్ గుడ్డును తన టీం లో ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారో చెప్పాలని బిగ్ బాస్ అన్నారు. రెడ్ కలర్ గుడ్డు ఎవరికి ఇస్తారో వారు కూడా చీఫ్ కంటెంట్ అయ్యే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. ఓడిపోయిన క్లాన్ నుంచి ముగ్గురు చీఫ్ కండక్టర్స్ అయ్యే అవకాశం ఉందన్నారు. అభయ్ తప్ప మిగిలిన వాళ్ళకి ఆ ఛాన్స్ ఉందని అన్నారు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మిగతా వాళ్లతో పాటుగా విష్ణు ప్రియ పక్కనే నాగమణికంఠ ఉంటాడు. పూల్ లో దిగిన పృద్విని విష్ణు ప్రియ చెప్తుంది.

అది కళ్ళా స్కానర్లా అని మణికంఠ అంటాడు. నేను పృథ్వినే కాదు మిగిలిన వాళ్లకు లైన్ వేస్తున్నాను అని విష్ణు ప్రియ చెప్తుంది. ఇంకెవరెవరు ఉన్నారు అబ్బాయిలు అని సీత అంటే అప్పుడు సరదాగా యాష్మి, ప్రేరణలో ఒకరు నాగమణికంఠ అని డౌట్ గా చూపించారు. నీకు ఎవరు లైన్ వేస్తారు నీకు పెళ్లి అయిపోయింది కదా అని ఇండైరెక్టుగా అతని పరువు తీసింది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.

మణికంఠ కూడా నవ్వాడు. ఆదిత్య గారికి కూడా అని సీత సరదాగా అంటుంది. వేస్తున్నాను అని వెటకారంగా విష్ణు ప్రియ ఆన్సర్ చెప్తుంది. ఆదిత్య ఓం గారి కళ్ళు బాగుంటాయని తనకు ఇష్టమని విష్ణు ప్రియ అంటుంది. తర్వాత నువ్వు హగ్ చేసుకున్నప్పటి నుంచి ప్రేమ మొదలైందని నాగమణికంఠతో విష్ణు ప్రియ చెప్తుంది. నిజమా రా థాంక్స్ రా అయితే మళ్లీ హగ్ చేసుకుంటా అని అంటాడు. దానికి ఆమె ఛీ ఛీ అనుకుంటూ లేచి నిలుచుని పక్కకి వెళ్ళిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news