ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్..!

-

టాలీవుడ్  యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటూ తన సినిమా అప్డేట్స్ తో పాటూ కొన్ని సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ ఉంటాడు. అలాగే ట్రోలర్స్ కు ఎప్పటికప్పుడు సాలిడ్ కౌంటర్లు సైతం వేస్తుంటాడు. అలాంటి ఏ హీరో ఇప్పుడు సోషల్ మీడియాకు దూరమయ్యాడు. విశ్వక్ సేన్ తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా విశ్వక్‌సేన్‌ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టారు. సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇది చూసిన అయన ఫ్యాన్స్ కేవలం కొన్ని రోజులు పోస్ట్‌లు పెట్టరేమో అని భావించారు. కానీ, ఇప్పుడు అసలు ఇన్‌స్టాలో అతని అకౌంట్‌ కనిపించడం లేదు. దీంతో కారణమేంటంటూ ఆయన అభిమానులు ట్విట్టర్ (ఎక్స్‌)లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇటీవలే ఓ యూట్యూబర్‌ ‘కల్కి2898 ఏడీ’ రిలీజ్‌ కాకముందే రివ్యూ ఇవ్వడంపై ఆయన తప్పు పట్టడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు విశ్వక్ తన ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేయడంతో రీజన్ ఇదే అయి ఉంటుందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news