నరేష్‌కు షాక్.. అతనే ‘మా ’కొత్త అధ్యక్షుడు

-

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో వివాదం ముదిరిపోయింది. ఎట్టకేలకు నరేష్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేశారు. జీవితా రాజశేఖర్ జీవితాశయం నెరవేరినట్టైంది. మా ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంది. మా సభ్యుల్లో ఏదో ఒక ముసలం ముదురుతూనే ఉంది. చివరకు నరేష్‌ను పదవీచిత్యుడిని చేశారు. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు సినీ పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారు.

నరేష్ విధివిధానాలు, ఏకపక్ష ధోరణితో విసిగెత్తిపోయామని మా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి జీవితా, మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆరోపణలు చేస్తుండేవారు. నరేష్‌తోనే తమకు సమస్య ఉందని బహిరంగంగానే ప్రకటించారు.అయితే ఈ గ్యాప్ మాత్రం ఎంతకీ తగ్గకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఎంత రసాభాసాగా మారిందో అందరికీ తెలిసిందే. అందుకే సినీ పెద్దలైన కృష్ణంరాజు, చిరంజీవి వంటి వారు సమావేశమైన నరేష్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలిగించినట్టు తెలుస్తోంది.

మా అధ్యక్షుడు సీనియర్ నటుడు వి కె.నరేష్ 41 రోజులు సెలవు పెట్టడం వల్ల డిసిప్లినరీ కమిటీ మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ , కలిసి బై లాస్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీని యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ మేరకు ఓ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగా స్టార్ చిరంజీవి, మురళీమోహన్ , జయసుధ తో పాటుగా మా కార్యర్గవంతా పాల్గొంది. ఇందులో యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ, తనీష్, రాజీవ్ కనకాల శివబాలాజీ , అనితా చౌదరి , జయలక్ష్మి, కరాటే కళ్యాణి ఏడిద శ్రీరామ్ రవి ప్రకాష్ టార్జాన్ పసునూరి శ్రీనివాస్ రాజా రవీంద్ర ఆలీ సురేష్ కొండేటి ,అశోక్ కుమార్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news