VNRTrio : నితిన్ తో మరోసారి రష్మిక రొమాన్స్…వీడియో రిలీజ్

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి చిత్రంతోనే వి’జయం’ అందుకుని ఆ తర్వాత ‘ధైర్యం’గా కెరీర్ ​ను కొనసాగిస్తూ.. ప్రేక్షకుల’దిల్’లో స్థానం సంపాదించుకున్నారు హీరో నితిన్. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందు కెళ్తున్నారు.

అయితే కొంత కాలంగా ఆయన ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడటం లేదు. రీసెంట్ ​గా ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్​గా నిలిచింది. నితిన్​ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఇక తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా క్రేజీ ప్రాజెక్ట్‌ ను అనౌన్స్‌ చేశాడు నితిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో.. ఇప్పటికే భీష్మ చేసిన నితిన్‌.. మరోసారి అతని దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్‌. ఈ మేరకు ఓ వీడియో ద్వారా అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో నితిన్‌…అలాగే.. రష్మిక ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version