29న వ్యూహం రిలీజ్.. RGV ఆసక్తికర వ్యాఖ్యలు

-

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ బోర్డు వాళ్ళ నిలిపివేసిన విషయం తెలిసిందే. కొన్ని మార్పులు చేర్పులతో ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రాంగోపాల్ వర్మ. వ్యూహం సినిమా గురించి తాజాగా    హైదరాబాద్  ప్రసాద్ ల్యాబ్ వద్ద మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యూహం  డిసెంబర్ 29న విడుదల కానుందని తెలిపాడు. అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పాను. ఫైనల్ రిలిజ్ కు రెడీ అయ్యింది వ్యూహం.
ఎం మాయచేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారు అని అస్సలు అడగొద్దు. ఏపీ సీఎం నాకు పరిచయం లేదు. వైఎస్ ఆర్ గారు చనిపోయిన తరువాత ఏమీ జరిగింది అనేది వ్యూహం సినిమా. ఇందులో అన్ని అంశాలను టచ్ చేసాము. గతం లో బయట వాళ్లు మైక్స్ దగ్గర ఏమీ చెప్పారో అదే ప్రజలకు తెలుసు.  కానీ వాళ్ల బెడ్ రూమ్, బాత్ రూమ్ విషయాలు చూపించాను. అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ లే. నేను ఏమీ చూపించానో అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది అని తెలిపారు రామ్ గోపాల్ వర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version