సాధారణంగా సినీ ఇండస్ట్రీలో మిగతా దర్శకులతో పోల్చుకుంటే దాసరి నారాయణరావు సినిమాలు తీయడంలో చాలా భిన్నంగా ఆలోచిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆయన సినిమా తీస్తున్నారంటే చాలు కథా బలం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సినిమాలోని మిగతా అంశాల కంటే ముందే కథకు ఆయన ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు. అందుకే మిగతా దర్శకులు హీరోయిన్ అందాలు , శృంగారం అంటూ ఎన్నో అందాలను ప్రదర్శింప చేస్తూ సినిమాలు తీసినా సరే ఆయన మాత్రం కథనే నమ్ముకొని సినిమాలు తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఎందుకంటే అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్దగా వ్యవహరిస్తున్న ఆయన ఎలాంటి వివాదాలు సృష్టించకూడదు అని అభిప్రాయపడేవారు. అయితే దాసరి నారాయణరావు ఏ పని చేసినా సరే అందుకు ఎన్టీఆర్ ప్రోత్సాహం అనేది కచ్చితంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ఒకానొక సమయంలో దాసరి సర్దార్ పాపారాయుడు సినిమా తీయాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ ని హీరోగా పెట్టాలని అనుకున్నారు. దాంతో ఎన్టీఆర్ ని కలిసి విషయం చెప్పగా ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నారు. అంతా బాగుంది హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు.?ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది కదా హీరోయిన్ నడుము చూపిస్తే మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అంటూ ఎన్టీఆర్ చెప్పారట.
కానీ ఎందుకో దాసరికి ఇలా హీరోయిన్ అందాలు, శృంగారాలు చూపించి సినిమా తీయడం ఇష్టం లేదు
ఈ విషయం ఎన్టీఆర్ కి చెప్పే ధైర్యం లేదు. కానీ ఏదోలా శ్రీదేవిని ఒప్పించి తీస్తాడులే అని ఎన్టీఆర్ అనుకున్నా కూడా సినిమా విడుదలయ్యాక అందులో ఒకటి కూడా అలాంటి సన్నివేశాలు లేకపోవడం కానీ చిత్రం ఘనవిజయం సాధించడం జరిగింది. మొదట్లో తాను చెప్పిన మాట దాసరి వినలేదని ఎన్టీఆర్ కోప్పడిన ఆ తర్వాత.. శత జయంతి వేడుకల్లో దాసరిని ఎన్టీఆర్ మెచ్చుకుంటూ కుర్ర కారుకు శ్రీదేవి మేడం మజా ఇస్తారు కాబట్టి ఆమె నడుము చూపించి డబ్బులు సంపాదిస్తారు అనుకుంటే మీరు మాత్రం చిత్రమైన వారు అంటూ ఆయనకు కితాబు కూడా ఇచ్చారట.