రేపు నిజామాబాద్ ఐటీ హబ్​ను ప్రారంభించనున్న కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకెళ్తోంది. ఇప్పటిదాకా హైదరాబాద్ మహానగరం మాత్రమే ఐటీకి అడ్డాగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే కరీంనగర్, వరంగల్, మహబూబ్​నగర్, సిద్దిపేటలో ఐటీ టవర్​లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా నిజామాబాద్​లో ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది.

“రాష్ట్ర మంత్రి కేటీఆర్.. బుధవారం రోజున నిజామాబాద్ ఐటీ హబ్​ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ‘టైర్‌ 2 పట్టణాలు, నగరాలకు ఐటీ సెక్టార్‌లో విస్తరించడంలో భాగంగా నిజామాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌ను రేపు ప్రారంభిస్తాను. యువత తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి, సరికొత్త ఆవిష్కరణల కోసం ఇందులో టీ-హబ్‌, టాస్క్‌ సెంటర్లను కూడా ఇందులో ఉన్నాయి. దీనిద్వారా తెలంగాణ అభివృద్ధిలో యువత పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది”. అంటూ కేటీఆర్ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news