టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ ఇంద్రజ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈమె ఆలీతో మొదటిసారి యమలీల సినిమా ద్వారా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఆమె చెన్నైలో స్థిరపడినప్పటికి తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇంద్రజ తెలుగులో కన్నా బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఎక్కువగా సినిమాలు చేయడం గమనార్హం. ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన విషయంలో.. ఈ కథకు ఇంద్రజ మాత్రమే సరిపోతుంది అని అనుకొని వచ్చిన వారి దగ్గర మాత్రమే చేస్తానని కథ విషయానికి వస్తే నచ్చితేనే చేస్తాను.. నచ్చకపోతే సినిమాలు వదిలేస్తాను అని కూడా ఇంద్రజ తెలిపింది.ఇంద్రజ మాట్లాడుతూ పాత్ర నచ్చితే అక్క, వదిన, భార్య ఇలా ఏ పాత్ర చేయడానికైనా తనకు ఇబ్బంది లేదు అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తన వివాహానికి సంబంధించి కూడా ఆమె మాట్లాడుతూ.. మా ఆయన ఒక ముస్లిం.. పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే కేవలం మనసు మాత్రమే.. మా ఇద్దరిని అదే దగ్గర చేసింది. ఇక మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవారు.. అలా అతడి ద్వారా ఆరు సంవత్సరాల పాటు మేమిద్దరం స్నేహితులుగా కలిసి ఉండి.. ఒకరినొకరు అర్థం చేసుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని.. ఆయన రైటర్ , యాడ్ ఫిలిం మేకర్ అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.. ఇవేకాకుండా ఫ్యామిలీ బిజినెస్ లు కూడా చాలా ఉన్నాయి అని నటి ఇంద్రజ తెలిపింది. ఇక ప్రస్తుతం ఇంద్రజ భర్త బిజినెస్ చూసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నట్లు వీరికి ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇంద్రజ మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.