‘వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్’ టాక్ : ఎమోషనల్ లవ్, లైఫ్ జర్నీ….!!  

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా యువ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. గతంలో ఓనమాలు, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు, ఉంగరాల రాంబాబు తదితర సినిమాలు తీసిన క్రాంతి మాధవ్, ఈ సినిమాతో లవ్, లైఫ్ జర్నీ కి సంబందించిన ఒక కీలక పాయింట్ ని ఎంచుకున్నట్లు ఈ సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తే కొంతవరకు మనకు అర్ధం అవుతుంది. కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. విజయ్ సరసన ఇజా బెల్లె, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరీన్ థెరిస్సా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ నిర్మిస్తున్నాడు.

ప్రపంచంలో ప్రేమ అనేది ఎంతో నిస్వార్ధం అయినది, కానీ ప్రేమ అనే రెండు అక్షరాలు మన జీవితంలో ఎంతో పెద్ద సునామిని రేపగలవు అంటూ విజయ్ చెప్పే బ్యాక్ గ్రౌడ్ డైలాగ్ తో ప్రారంభం అయ్యే ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్ గా, రొమాంటిక్ గా సాగుతుంది. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే తాను వరల్డ్ ఫేమస్ లవర్ అని అనిపించుకోవాలి అనేది హీరో యొక్క తపన అని మనకు అర్ధం అవుతుంది. అయితే అతడి జీవితంలోకి నలుగురు హీరోయిన్లు ఏ విధంగా వచ్చారు, అసలు కథ ఏంటి అనేది మనకు సినిమాలోనే తెలియనున్నట్లు అర్ధం అవుతుంది.

ఇక ట్రైలర్ చివర్లో, నా గుండెకు తగిలిన దెబ్బలు తెలియకుండా ఉండాలంటే, నాకు ఫిజికల్ గా ఈ గాయాలు, బ్లడ్ ఉండాల్సిందే అంటూ విజయ్ చెప్పే డైలాగ్ ప్రేమపై అతడి అభిప్రాయాన్ని మనకు సూచిస్తుంది. మొత్తంగా మంచి ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్, ఈనెల 14న రిలీజ్ కాబోయే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది అనే చెప్పాలి. మరి రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి…!!

Read more RELATED
Recommended to you

Exit mobile version