యూట్యూబ్ లో ‘ఎన్నాళ్ళకో’ రెట్రో సాంగ్ తో అదరగొడుతున్న ‘వెంకీ మామ’….!!

-

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. యువ దర్శకుడు బాబీ తెరెక్కిస్తున్న ఈ సినిమాపై వెంకీ ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం, నిజ జీవితంలో మామ, అల్లుళ్లయిన వెంకటేష్, చైతన్యలు ఈ వెంకీమామ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో పోషిస్తుండడం. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు, ‘మామ మామ వెంకీ మామ’ అనే మాస్ సాంగ్ శ్రోతలను విశేషంగా అలరించి సినిమాపై అంచనాలు పెంచింది.

ఇకపోతే నేడు ఈ సినిమాలో వెంకటేష్ మరియు పాయల్ రాజ్ పుత్ పై చిత్రీకరించిన ‘ఎన్నాళ్ళకో’ అనే పల్లవితో సాగె రెట్రో సాంగ్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. హీరో, హీరోయిన్ల పై ఓల్డ్ రెట్రో స్టైల్ డ్రెస్సింగ్ తో ఆకట్టుకునే సెట్స్ లో ఈ సాంగ్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యువ గాయకుడు పృథ్వి చంద్ర ఎంతో అందంగా ఆలపించిన ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం మరింత బాగుందని చెప్పాలి. ఇక, ఈ సాంగ్ కు పాత కాలపు రెట్రో స్టైల్ బీట్ ని అందించి శ్రోతలను ఆకట్టుకోవడంలో సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమలో వెంకటేష్ రైతుగా, అలానే చైతన్య సోల్జర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి సురేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version