ముద్రగడ ఇంటిపై దాడి వెనుక జనసేన కుట్ర – అంబటి

-

ముద్రగడ ఇంటిపై దాడి వెనుక జనసేన కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ ఇంటిపై దాడి జరిగింది.. జై జనసేన అంటూ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం గేటును తోసుకుంటూ వెళ్లి కారును ఢీకొట్టాడు ఓ వ్యక్తి. అయితే.. దీనిపై అంబటి రాంబాబు స్పందించారు. ఇవాళ కిర్లంపూడి లో ముద్రగడ పద్మనాభం ఇంటి గేటును ట్రాక్టర్ తో గుద్ది డ్యామేజ్ చేశారని… అక్కడ ఉన్న ఫ్లెక్సీలు చింపి అరాచకమైన పరిస్థితులు సృష్టించారని ఆగ్రహించారు.

ambati

దాడి చేసిన వ్యక్తిని అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పారని మండిపడ్డారు. తక్షణమే ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి.. ఖండించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరారు. ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రాజీనామాలు చేసి వస్తేనే పార్టీలో చేరుకుంటామన్న చంద్రబాబు మాటలు ఇక్కడ వర్తించవా..? అంటూ అంబటి రాంబాబు నిలదీశారు. వైసీపీ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని లాక్కోవాలని చూడటం దుర్మార్గం అన్నారు.

https://twitter.com/bigtvtelugu/status/1885930640979415315

Read more RELATED
Recommended to you

Exit mobile version