1. ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది?
A. 40
B. 60
C. 50
D. 20
2. కింది వాటిలో విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు ఏవి?
A. పునర్నిర్మాణం
B. పునర్నివాసం
C. నివారణ
D. పైవన్నీ
3. విపత్తు వల్ల జరిగేది?
A. ఆస్తినష్టం
B. మానవ ప్రాణ నష్టం
C. పై రెండు
D. ఏదీకాదు
4. ఏ మహాసముద్రంలో అత్యధికంగా సునామీ సంభవించే అవకాశం ఉన్నది?
A.ఆర్కిటిక్ మహాసముద్రం
B. బంగాళాఖాతం
C. పసిఫిక్ మహాసముద్రం
D. హిందూ మహాసముద్రం
5. జాతీయ విపత్తు నివారణ దినోత్సవం జరిపే రోజు?
A. డిసెంబర్ 29
B. నవంబర్ 29
C. అక్టోబర్ 29
D. జనవరి 29
6. భారతదేశం ఎన్ని కిలోమీటర్ల మేరకు తీరరేఖను కలిగి ఉన్నది?
A. 7200 కి.మీ.
B. 7400 కి.మీ.
C. 6400 కి.మీ.
D. 7516.6కి.మీ.
7 . నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 2005 ప్రకారం ఏర్పడిన సంస్థలు?
A. ఎస్‌డీఎంఏ
B. ఎన్‌ఐడీఎం
C. ఎన్‌డీఎంఏ
D పైవన్నీ
8. NDMAను విస్తరించండి?
A. National Disaster Management Assosiation
B. National Disaster Management Agency
C. National Disaster Management
D. National Disaster Management Authority
9. ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు?
A. 2005
B. 2004
C. 2001
D. 2003
10. భారతదేశంలో ఏ జోన్‌లో అత్యధిక భూభాగం భూకంపాలు సంభవించే అవకాశం కలిగి ఉన్నది?
A. జోన్-4
B. జోన్-5
C. జోన్-2
D. జోన్-3
జవాబులు:
1. ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది?
జవాబు: A. 40
2. కింది వాటిలో విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు ఏవి?
జవాబు: D. పైవన్నీ
విపత్తు నిర్వహణలో పునర్నిర్మాణం, పునర్నివాసం, నివారణ
3. విపత్తు వల్ల జరిగేది?
జవాబు: C. పై రెండు
విపత్తు వల్ల ఆస్తి, మానవ ప్రాణ నష్టాలు జరుగుతాయి
4. ఏ మహాసముద్రంలో అత్యధికంగా సునామీ సంభవించే అవకాశం ఉన్నది?
జవాబు: C. పసిఫిక్ మహాసముద్రం
పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా సునామీ సంభవించే అవకాశం ఉన్నది
5. జాతీయ విపత్తు నివారణ దినోత్సవం జరిపే రోజు?
జవాబు: C. అక్టోబర్ 29
6. భారతదేశం ఎన్ని కిలోమీటర్ల మేరకు తీరరేఖను కలిగి ఉన్నది?
జవాబు: D. 7516.6కి.మీ.
7 . నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 2005 ప్రకారం ఏర్పడిన సంస్థలు?
జవాబు: D. పైవన్నీ
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 2005 ప్రకారం ఎస్‌డీఎంఏ, ఎన్‌ఐడీఎం, ఎన్‌డీఎంఏ సంస్థలు ఏర్పడ్డాయి
8. NDMAను విస్తరించండి?
జవాబు: D. National Disaster Management Authority
National Disaster Management Authority
9. ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు?
జవాబు: A. 2005
10. భారతదేశంలో ఏ జోన్‌లో అత్యధిక భూభాగం భూకంపాలు సంభవించే అవకాశం కలిగి ఉన్నది?
జవాబు: A. జోన్-4
జోన్-4లోని అత్యధిక భూభాగం భూకంపాలు సంభవించే అవకాశం కలిగి ఉన్నది