ప్రాక్టీస్ బిట్స్ : ఇండియన్ పాలిటి

-

1. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు కాని తొలగింపులో పాల్గొనని వారు?
A. రాష్ట్ర విధానసభ సభ్యులు
B. పార్లమెంట్‌లో నిమినేటెడ్ సభ్యులు
C. పార్లమెంట్‌లో ఎన్నికైన సభ్యులు
D. ఎ మరియు బి

2. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సును జారీ చేసే అధికారాన్ని ఏమంటారు?
A. విచక్షణాధికారం
B. విశిష్ట అధికారం
C. శాసనాధికారం
D. పైవన్నియు

3. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది?
A. సంపూర్ణ మెజారిటీ సాధిస్తేనే అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు
B. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య మొత్తం ఓట్ల విలువ విషయంలో సమతూకం ఉంది
C. నియోజక గణంలో కొన్ని ఖాళీల ఉన్నప్పటికి ఎన్నిక జరుగుతుంది
D. పైవన్నియు సరైనవి

4. కింది వానిలో ఏ రకమైన వీటో అధికారం రాష్ట్రపతికి లేదు?
A. నిరపేక్ష వీటో
B. స్పెన్సివ్ వీటో
C క్వాలిఫైడ్ వీటో
D. పాకెట్ వీటో

5. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతికి సంబంధించి సరైనది?
A. దీనినికి ఒక పర్యాయం సవరించారు
B. పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో సవరిస్తుంది
C. పార్లమెంట్ సాధారణ మెజారిటీతో సవరిస్తుంది
D. ఎ మరియు బి

6. ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది?
A. రాజ్యసభలో అంతర్భాగం
B. రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా తొలగిస్తుంది
C. పార్లమెంట్ ఉభయ సభలు సంయుక్త సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు
D. పైవన్నీయు సరికావు

6. ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది?
జవాబు: D. పైవన్నీయు సరికావు
పైవన్నీయు సరికావు

7. డీఫాక్టో, డీజ్యూర్ అధిపతులు అనే భావన ఎక్కడ ఉంటుంది?
A. పార్లమెంటరీ వ్యవస్థ
B. అధ్యక్ష వ్యవస్థ
C. సమాఖ్య వ్యవస్త
D పై అన్నిటిలో

8. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎలా ఉంటుంది?
A. పార్లమెంట్‌కు సమాంతరంగా ఉంటుంది
B. పార్లమెంట్‌కు సహసంబంధంగా ఉంటుంది
C. పార్లమెంట్‌తో సంయుక్తంగా ఉంటుంది
D. పైవేవికావు

9. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మధ్య ఏ విషయంలో పోలిక ఉంటుంది?
A. ఎన్నిక పద్ధతిలో
B. ఎన్నుకునే నియోజక గణంలో
C. తొలగించే పద్ధతిలో
D. పై అన్నిటిలో

10. కింది ఏ అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు?
A. నిర్ణాయక ఓటు
B విచక్షణ అధికారం
C. వీటో అధికారం
D. బి మరియు సి

జవాబులు: 

1. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు కాని తొలగింపులో పాల్గొనని వారు?
జవాబు: A. రాష్ట్ర విధానసభ సభ్యులు
రాష్ట్ర విధానసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు కాని తొలగింపులో పాల్గొనరు

2. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సును జారీ చేసే అధికారాన్ని ఏమంటారు?
జవాబు: C. శాసనాధికారం
రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సును జారీ చేసే అధికారాన్ని శాసనాధికారం అంటారు

3. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది?
జవాబు: D. పైవన్నియు సరైనవి
సంపూర్ణ మెజారిటీ సాధిస్తేనే అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు, రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య మొత్తం ఓట్ల విలువ విషయంలో సమతూకం ఉంది, నియోజక గణంలో కొన్ని ఖాళీల ఉన్నప్పటికి ఎన్నిక జరుగుతుంది

4. కింది వానిలో ఏ రకమైన వీటో అధికారం రాష్ట్రపతికి లేదు?
జవాబు: C క్వాలిఫైడ్ వీటో
క్వాలిఫైడ్ వీటో అధికారం రాష్ట్రపతికి లేదు

5. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతికి సంబంధించి సరైనది?
జవాబు: D. ఎ మరియు బి
రాష్ట్రపతి ఎన్నికను ఒక పర్యాయం సవరించారు. ఇందుకు పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ అవసరం

7. డీఫాక్టో, డీజ్యూర్ అధిపతులు అనే భావన ఎక్కడ ఉంటుంది?
జవాబు: A. పార్లమెంటరీ వ్యవస్థ
పార్లమెంటరీ వ్యవస్థలో డీఫాక్టో, డీజ్యూర్ అధిపతులు ఉంటారు

8. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎలా ఉంటుంది?
జవాబు: B. పార్లమెంట్‌కు సహసంబంధంగా ఉంటుంది
రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం పార్లమెంట్‌కు సహసంబంధంగా ఉంటుంది

9. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మధ్య ఏ విషయంలో పోలిక ఉంటుంది?

జవాబు: A. ఎన్నిక పద్ధతిలో
ఎన్నిక పద్ధతిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మధ్య పోలిక ఉంటుంది

10. కింది ఏ అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు?
జవాబు: D
ఉపరాష్ట్రపతికి విచక్షణ, వీటో అధికారాలు ఉండవు

Read more RELATED
Recommended to you

Exit mobile version