తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భారతీయులకు ఒక మంచి శుభవార్తను అందించాడు. మాములుగా మనము వేరే దేశానికి వెళ్లాలంటే ఫ్లైట్ లోనే వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇండియా నుండి థాయిలాండ్ కు చాలా మంది విహారయాత్రకు వెళుతూ ఉంటారు. విమానంలో వెళ్ళాలి అంటే రాను పోను దాదాపుగా 30 నుండి 40 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కాగా కేంద్రమంత్రి సమాచారం అతి త్వరలోనే ఇండియా నుండి థాయిలాండ్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి అవసరం అయిన హై వే రహదారులను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే భారత్ – మయన్మార్ – థాయిలాండ్ హై వే పనులు 70 శాతం వరకు పూర్తి అయినట్లు తెలిపారునితిన్ గడ్కరీ. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యాపార, వాణిజ్య, విద్యా మరియు టూరిజం వంటి రంగాలు వృద్ధి చెందుతాయి.
నితిన్ గడ్కరీ : “భారత్ – మయన్మార్ – థాయిలాండ్” హై వే 70 శాతం పూర్తి…
-