భక్తి: సాయంత్రం పూట ఈ ఈ పనులు చెయ్యకూడదు… ఎందుకంటే..?

-

మనం అనేక పద్ధతులని అనుసరిస్తూ ఉంటాం. ఏ పనులు చెయ్యాలి..? ఎప్పుడు చెయ్యాలి..? వంటి వాటికి ముహుర్తాలని కూడా పాటిస్తాం. అంతే కాకుండా వాస్తు ప్రకారం కూడా కొన్ని విషయాల లో నియమంగా ఉంటాం. అయితే ఏది చూసిన చాల కట్టుదిట్టంగా ఉంటాం. అందుకనే ఈ విషయాలని కూడా మీరు తెలుసుకోండి. మీరు వీటిని ఇప్పటికే పాటిస్తూ ఉండే వుంటారు. మరి ఓ లుక్ వేసేసి కొత్త విషయాలు ఏమైనా ఉంటె పాటించేయండి.

వివరాల లోకి వెళితే… వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం సమయంలో కొన్ని పనులను చేయడంలో జాగ్రత్తలు పాటించాలి అని పండితులు చెబుతున్నారు. సాయంకాలం వేళ ఆడవారిని అస్సలు అవమానించకూడదట. ఇలా చేస్తే ఏ మాత్రం మంచిది కాదు. అలానే ఆడవారు దీపాలు పెట్టిన తర్వాత కంటతడి పెట్టుకోకూడదు. ఒకవేళ మహిళలని నిందించడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందట. తద్వారా మీకు ధనప్రాప్తి దూరం అవుతుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు.

అంతే కాదండి సాయంత్రం సమయం లో నిద్రించడం మహా పాపం అని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనుక సంధి వేళ నిద్రపోకుండా ఉండేలా చూసుకోండి. చాల మంది ఈ విషయంలో ఎంతో కట్టుదిట్టంగానే ఉంటారు. సాయంకాలం సమయంలో మీ ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురును వాడడం, తులసి మొక్కకు నీరు పోయడం చేయకూడదు. కనుక వీటిని జాగ్రత్తగా గమనించండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version