నారదుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ప్రదిక్షణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి

-

నారదుడు.. ఎల్లప్పుడు నారాయణ, నారాయణ అంటూ లోక సంచారం చేస్తాడు. అయితే ఆయన కూడా పరమ శివ భక్తుడు అంటే కొందరు నమ్మరు కానీ నిజం. ఆయన పలుచోట్ల శివలింగాన్ని ప్రతిష్టించాడు. వాటిలో ప్రముఖమైనది ఒకటి కంచిలో ఉన్నది ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం…

కంచి లేదా కాంచీపురం అనగానే మనకు టక్కుమని గుర్తుకువచ్చేది కంచి పట్టు చీరలు, బంగారు, వెండి బల్లి మాత్రమే కాదు, సుమారు వెయ్యికిపైగా దేవాలయాలు కలిగి ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో అడుగిడగానే మనం కొన్ని దశాబ్ధాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి కంజీవరం అనే పేరు కూడా ఉంది. హిందువులకు మోక్షప్రదానమైన ఏడు నగరాల్లో కాంచీపురం ఒకటి. మోక్షభూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షన్ని ఇచ్చే నగరాలు ఏడు అవి వరసగా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతికా, ద్వారక, కంచి.

అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగునా దేవాలయాలే దర్శనమిస్తాయి. కంచి నగరంలో ఎక్కువగా ఆ పరమశివుడు, విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. అందుకే కంచీపురంను ‘శివకంచి’ మరియు ‘విష్ణు కంచి’ అనే రెండు నగర భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉండటం విశేషం. అంతే కాదు ఇక్కడ ప్రసిద్ది చెందిన ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం కైలసనాథర్ లేదా కైలాసనాథ్ ఆలయాలు కూడా సందర్శించతగినవి. వీటిలోకైలాసనాథర్ ఆలయ విశేషాలు తెలుసుకుందాం…

కైలసనాథ్ ఆలయంబహుశా నగరంలోని అతి పురాతన ఆలయం. 567వ సంవత్సరంలో కట్టారు, రాజసింహ పల్లవ రాజు 7వ శతాబ్దంలో విస్తరించారు. పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతిపురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకూ, శిల్ప సంపదకూ, ఎన్నో అపురూప శిల్పాలకు ఎంతో ప్రసిద్ధమైనది. కైలాసనాథర్ ఆలయం శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ ఆలయం పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు ఈ ఆలయంను శివుని మీద భక్తితో ఎనిమిది శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు. చారిత్రక ప్రసిద్ధిని పొందిన ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ గాధ గురించి తెలియకున్నా నిర్మాణ విశేషాలు మాత్రం తరగనివే ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధమనోహరంగా మిగిలిన ఆలయాల మాదిరి కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధమనోహరంగా ఉన్నాయి. ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యానికి ఒక ఉదాహరణ. మరో విశేషమేమిటంటే రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్ర కారులు పేర్కొనడం..అంతకు ముందు పల్లవులు నిర్మించినవి చాలా వరకు గుహాలయాలే.

పదహారు ముఖాల లింగ రూపం

గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో శ్రీ కైలాస నాథర్ దర్శనమిస్తారు. సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణం లోనికి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది. గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ రూపాలు అబ్బుర పరుస్తాయి. . ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది.

సాధారణంగా ఆ సమయంలో నిర్మాణాలు, భవనాలు నిర్మించడానికి ఉపయోగించిన ద్రావిడ నిర్మాణ సమకాలీకరణ ఉంది. ఆలయం చుట్టు పక్కల శివలీలలు, శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంది.మరో విశేషమేమింటంటే శివలింగం పక్కన ఉండే బిలంలోకి వెళ్ళి బయటకి వస్తే మరుజన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ బిలం లోకి పాకుతూ సులభంగానే వెళ్ళవచ్చుకానీ బయటికి రావటం కొంచెం కష్టం.

సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రకారం, ప్రదక్షిణ ప్రాంగణం మరియు గర్భాలయం అనే మూడు భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. అవ్వడానికి విశాల ప్రాంగణం అయినా ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదల కుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసి పోయినట్లుగా కనపడుతుంది. ప్రాకారానికి లోపలి వైపున ఎన్నో శివ రూపాలను చెక్కారు. సున్నితమైన నిర్మాణంతో పాటు, ఆలయం పై ‘విమానం’ మందిరంపై గోపురం ప్రసిద్ధి చెందింది. ఆలయం కూడా నటరాజ్ భంగిమలో ఉన్న శివుడి యొక్క నగిషీలు చెక్కి ఉన్న ప్యానెల్లు ఉన్నాయి.

నారదుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదిక్షణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయ గర్భగుడిలో నల్ల గ్రానైట్ నుండి చెక్కబడిన ఏకైక 16-వైపుల శివలింగం (శివుడిని సూచించే చిహ్నంగా) కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, నిర్మాణం అత్యంత ఆకర్షణీయమైన లక్షణం దాని ఉప-పుణ్యక్షేత్రాలు, అనేక స్తంభాలు చిన్న దేవతల శిల్పాలతో లేదా ఉపఆలయాలతో అలంకరించబడి ఉంటాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version