వారానికోసారన్నా గుడికి వెళ్తే.. అదో ప్రశాంతత. బిజీ లైఫ్ లో అదే రిలీఫ్ ఇచ్చే అంశం. అందుకే.. ఎన్ని సమస్యలు ఉన్నా.. ఒత్తిళ్లు ఉన్నా.. ఆ పరమేశ్వరుడికి చెప్పుకోవాలి. దానివల్ల ఫలితం ఎలా ఉన్నా.. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అయితే గుడికి వెళ్లినప్పుడు తప్పకుండా చేయాల్సిన పని ప్రదక్షిణ.. ప్రదక్షిణం అంటే కుడి వైపుగా కదలటం. సూటిగా వేడితే ముందుకి కదలటం జరుగుతుంది. ఒక వైపు కదలకుండా ఒక వైపు మాత్రమే కదిలితే కదలిక సరళ రేఖలో కాక వృత్తాకారంగా ఉంటుంది.
ఆ వృత్తానికి కేంద్రంగా ఎడమ ప్రక్కని ఉంచి కుడి ప్రక్కని మాత్రమే కదిపితే అది ప్రదక్షిణం అవుతుంది. ఎందుకంటే.. ప్రదక్షిణలో అద్భుతమై శక్తి ఉంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా ప్రదక్షిణ చేయటం మేలు కలిగిస్తుంది. తల్లి తండ్రులకి ప్రదక్షిణం చేస్తే ఎంతటి ఉత్కృష్టమైన ఫలితం లభిస్తుందో గణపతి కథ మనకి తెలియ చేస్తుంది.
ప్రదక్షిణం చేసేప్పుడు మనస్సు దేవుడి మీద నిమగ్నం చేసి ధ్యానం చేయాలి. తిరుపతిలో కనిపించే విశిష్టమైన ప్రదక్షిణం అంగ ప్రదక్షిణం. తడి బట్టలతో నేల మీద సాష్టాంగ పడి గుడి చుట్టూ దొరలటం. ఇది తమంతట తాము చెయ్యటం చాలా కష్టం. ఒకరు నేల మీద సాష్టాంగ పది ఉంటే మరొకరు వారిని దొర్లిస్తూ ఉంటారు.