దేశ రాజధాని ఢిల్లీని ఆప్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ లా మార్చేసిందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. విదేశాల నుంచి అక్రమ వలసలను అడ్డుకోవడంలో విఫలమైందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశీయులు రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలను ఆప్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఢిల్లీని డంపింగ్ యార్డ్ లా చేసింది.
యమునా నదిని మురికి కాలువగా మార్చింది. కుంభమేళా సందర్బంగా మంత్రలతో కలిసి ఇటీవల ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానం ఆచరించా.. ఇక్కడున్నా యమున నదిలో కేజ్రీవాల్ మునగగలరా..? దీనికి ఆయన నైతికంగా సమాధానం చెప్పాలని సీఎం యోగి డిమాండ్ చేసారు. నొయిడా-గాజియాబాద్ రోడ్లకు ఢిల్లీలోని అధ్వాన రహదారులకు చాలా తేడా ఉంది. ఢిల్లీలో మురుగు పొంగి పొర్లిపోతోంది. నీటి సమస్య కొరత ఢిల్లీ ప్రజలను వేధిస్తోంది. 24 గంటల విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది. ప్రజల నుంచి మూడు రెట్లు ఛార్జీలను వసూలు చేస్తోందని తెలిపారు.