పండగ పర్వదినం: మిలాద్ ఉన్ నబీ ప్రత్యేకత ఇదే..

-

ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండగ గురించి అందరికీ తెలుసు. ఆ తర్వాత బక్రీద్ కూడా చాలామందికి గుర్తే. కానీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజున జరుపుకునే పండగ గురించి చాలా మందికి తెలియదు. ప్రవక్త జన్మించిన రోజున జరిపే ఈ పండగని మిలాద్ ఉన్ నబీ అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మూడవ నెలలో మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటారు. క్రీస్తు శకం 571వ సంవత్సరంలో మక్కాలో మహమ్మద్ ప్రవక్త జన్మించారు.

మిలాద్ ఉన్ నబీ అక్టోబర్ 29వ తేదీ సాయంత్రం మొదలై అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం వరకూ ఉండనుంది. ఈ రోజున పాటలతో చాలా ఆహ్లాదంగా గడుపుతారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని అందంగా అలంకరించిన తమ తోటి వారికి ప్రవక్త బోధల్ని వినిపిస్తారు. ఇస్లాం మతంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రవక్త జీవితం గురించి తమ ముందు తరాలకి చేరవేస్తారు.

ఈ పర్వదినాన ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న కొటేషన్లు ఇవే..

ఈ పండగ రోజు అల్లా సుఖ సంతోషాలని ఆయురారోగ్యాలని ఇస్తాడని కోరుకుంటూ ఈద్ ముబారక్.

జీవితంలో సరైన దిశని అల్లా చూపిస్తాడని ఆశిస్తున్నాం.

అల్లా ఆశీర్వాదం మనమీద చూపిస్తాడని పండగ పర్వదినాన అంతా మంచే జరగాలని కోరుకుంటూ..

జీవితంలో విజయాన్ని చేకూర్చి ఆ సంతోషాలని నలుగురితో పంచుకునే విధంగా శక్తి సామర్థ్యాలని అల్లా ప్రసాదిస్తాడని అనుకుంటూ ఈద్ ముబారక్.

ప్రవక్త బోధించిన సారాంశాలని జీవితానికి అన్వయించుకుంటూ ఆనందంగా గడపడానికి కావాల్సిన అన్నింటినీ సంపాదించుకుంటావని ఆశిస్తూ..

ఈద్ ముబారక్.

కరోనా లేకపోయుంటే ముస్లింలు అందరూ సామూహికంగా ప్రార్థనలు జరిపేవారు. కానీ కరోనా నియమాల మధ్య అలాంటివి సాధ్యపడనందున ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version