ఈ తప్పులు చేస్తే.. లక్షిదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది..!

-

ధనవంతుడు అవ్వాలని అందరికీ ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యం కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే దయ సేవా భావం మనలో ఉండాలి అలానే వినయం వివేకం కూడా ఉండాలి. అప్పుడు లక్ష్మీ మన ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఈ పొరపాట్లని చేయకుండా ఉండడం మంచిది.

బుధవారం నాడు ఎవరికి అస్సలు అప్పు ఇవ్వకండి. పదేపదే మీరు బుధవారం నాడు అందరికీ అప్పు ఇచ్చుకుంటూ వెళ్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. పూజ గదిలో ఎప్పుడూ కూడా మంచి ఆహార పదార్థాలని కడిగినవి పెట్టాలి. ఎంగిలి చేసిన ఆహార పదార్థాలను పెట్టకూడదు. తామర పువ్వులని అసలు నడపకూడదు తామర పువ్వులన్ని నలిపితే పాపం. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.

ప్రతి ఒక్కరూ కూడా నదులని సరస్సులను పవిత్రంగా భావించాలి వాటిలో మూత్ర విసర్జన చేయడం తప్పు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. గోడలమీద చెడు మాటలు, పనికిరానివి రాస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. చాలామంది కాళ్లు కడిగేటప్పుడు కాళ్లు మీద కాలు వేసి రుద్దుతూ ఉంటారు అలా కాళ్ళని తోముతూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు. ఎప్పుడైనా సరే ఇంటికి ఎవరైనా వస్తే వారిని మంచిగా చూసుకోవాలి వాళ్ళని గౌరవించాలి ఒకవేళ కనుక అవమానించినా లేదంటే సరిగ్గా మర్యాదలు చేయకపోయినా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version