సూర్య గ్రహణం రోజు ఈ తప్పులు చేశారో జీవితాంతం భాధపడతారు.. జాగ్రత్త..

-

ఈ రోజు ఈ ఏడాదిలోనే తొలి సూర్య గ్రహణం ఏర్పడింది..భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీని కారణంగా సూర్యుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు..ఈసారి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని, చైనా, అమెరికా, మైక్రోనేషియా, మలేషియా, ఫిజీ, జపాన్, సమోవా, సోలమన్, బరూని, సింగపూర్, థాయ్‌లాండ్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దక్షిణ పసిఫిక్ మహాసముద్రాల లో కనిపించనుంది.

వియత్నాం, తైవాన్, పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ హిందూ మహాసముద్రంలో కనిపిస్తాయి. కాబట్టి సూర్యగ్రహణం శాస్త్రీయ ప్రాముఖ్యత ఏమిటి, ఈ సమయంలో తినడం, త్రాగటం ఎందుకు నిషేధించబడుతుందో తెలుసుకుందాం.. అసలు ఈరోజు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు ఇప్పుడు చూద్దాం..

ఏం చెయ్యకూడదు..

గ్రహణ సమయంలో ఒంటరిగా ఏ ఒక్క ప్రదేశానికి లేదా దహన సంస్కారాల కు ఒంటరిగా వెళ్లకండి. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.మరోవైపు, జ్యోతిష్య శాస్త్రంలో, గ్రహణం సమయంలో నిద్రపోకూడదు, సూదిలో దారం కూడా వేయకూడదు..

ఏం చెయ్యాలి..

సూర్యగ్రహణం తర్వాత, గంగాజలం తో స్నానం చేసి, గంగాజలాన్ని ఇల్లంతా చల్లండి., గ్రహణాంతరం స్నానం చేయండి.గ్రహణ సమయం లో పచ్చళ్లు, ఆహార పదార్థాల పై గరక వేయండి.గ్రహణ సమయంలో హనుమంతుడిని పూజించండి. గ్రహణం విడిచిన తర్వాత దేవుళ్ల ను శుభ్రం చేసి దీపారాధన చేయండి… ఇది అసలు సంగతి.. ఇవి తప్పక గుర్తుంచుకోండి..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version