దేవుడి గుడి లో గంట మోగించడం వెనక ఉన్న పరమార్థం ఏమిటి?

-

గుడిలోకి అడుగు పెట్టకముందే ఆలయ తాలూకు వాతావరణం మనలో కలిగిలా చేసేది గుడి (temple) గంట శబ్దం. టంగ్ మని మోగే శబ్దం గుడి ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నట్లు ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. ఆలయంలోకి వెళ్ళిన ప్రతీ ఒక్కరూ గంట మోగిస్తారు. సాయంత్రం పూట, తోటలో పూసిన పూలు తీసుకుని దేవుడి గుడిలోకి ప్రవేశించినపుడు మోగించిన గంట శబ్దం చాలా శ్రవణానందంగా ఉమ్టుంది. ఐతే మీకిది తెలుసా? ప్రతీ గుడిలో గంట ఉంటుంది. ప్రతీ ఒక్కరూ దాన్ని మోగిస్తారు. అలా ఎందుకు మోగిస్తారు? దాని వెనక ఏదైనా అర్థం ఉందా? అని మీకు చాలా సార్లు అనిపించి ఉంటుంది.

గుడి /temple

అవును, గుడి లో గంట మోగించడం వెనక అర్థం పరమార్థం ఉన్నాయి. సాధారణంగా చెప్పేవాళ్ళ విషయాన్ని తీసుకుంటే, గంట మోగించడం ద్వారా నీ దగ్గరకి నేను వచ్చాను స్వామీ అని గుర్తు చేసినట్టు అని చెప్పడానికే గంట మోగిస్తారు అని అంటారు. కానీ అసలైన అర్థం మరోటి ఉంది. గుడి గంటలో సంగీత శక్తి ఉంది. అందులో నుండి వచ్చే శబ్దం చెవులకి ఇంపుగా ఉంటుంది. అదీగాక గుడి గంట నుండి ఓంకార శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని అందరూ వినేలా చేయడానికే గుడి గంట మోగిస్తారు.

గుడి గంట నుండి వచ్చే ఓంకార శబ్దాన్ని వినడానికి మనస్సు పొరల్లో పవిత్రత ఉండాలి. అలా ఉన్నవారికి ఓంకార నాదం వినిపిస్తుంది. హారతి ఇచ్చే సమయాలలో దాదాపు ప్రతీ ఆలయంలో గుడి గంట మోగిస్తారు. ఇది కొన్ని సార్లు సంగీత వాయిద్యాలతో, శంఖారావములతో కూడుకుని ఉంటుంది. ఇవన్నీ అనవసరమైన ఆలోచనల నుండి చెదరగొట్టి మనస్సుని భగవంతుని మీద కేంద్రీకరించేలా చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version