కర్మన్ ఘాట్ ‘ధ్యాన ఆంజనేయ స్వామి’ క్షేత్ర విశేషాలు …!

-

ఇప్పటి హైదరాబాద్ ని ఒకప్పుడు లక్ష్మీపురం అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న ధ్యాన ఆంజనేయ స్వామీ వారి క్షేత్రం స్వయంభువుగా వెలసిన అతి ప్రాచీన దేవాలయం అని చరిత్ర తెలియచేస్తుంది. ఇప్పటి రంగారెడ్డిలోని సరూర్ నగర్ సమీపంలో 1143 ప్రాంతంలో ఈ ఆలయాన్ని కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాప రుద్రుడు నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెప్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి చూస్తే అందరిలో భక్తి భావం పెరుగుతుంది. ఈ ఆలయాన్ని కర్మన్ ఘాట్ అని పిలుస్తారు.

ఇంతకి ఆ పేరు ఎలా వచ్చిందంటే 17 వ శతాబ్దంలో ఔరంగజేబు మన దేశాన్ని ఆక్రమించుకుని హిందూ దేవాలయాలన్నీ ధ్వంసం చేయమని ఆదేశించాడు.అప్పుడు అతని సైన్యం ఈ ఆలయం చెంతకు రాగానే ఒక పెద్ద భీకర శబ్దం విని ఔరంగజేబు వణికిపోయాడు. దానితో ఆంజనేయ సాక్షాత్కారం లభించగానే ఆ రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.అని చరిత్ర చెప్తుంది. ఇక్కడి ఆంజనేయుడు ఆశ్రిత భక్తకోటి కల్పవృక్షంగా వెలుగొందుతున్నాడు.

ఇక్కడి స్వామిని వేడుకుని నలబై రోజుల పాటు ప్రదక్షిణలతో సేవిస్తే సంతానప్రాప్తి కలుగుతుంది. అని భక్తుల నమ్మకం. భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించటానికి విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. రాజీవ్ గాంధి విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉండటం వల్ల విదేశీ భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version