ఉప్పుతో ఇలా చేస్తే కష్టాలు తొలగి, డబ్బులు వస్తాయట..

-

ఎంత కష్టపడి సంపాదించిన కూడా డబ్బులు ఎక్కువ కాలం నిల్వవు..ఏదొక రూపంలో ఖర్చులు అవ్వడంతో డబ్బులు ఖాళీ అవుతాయి..ఈరోజుల్లో పనులు అన్నీ డబ్బులతోనే జరుగుతాయి.డబ్బుకు జనం దాసోహం..డబ్బు మీదే ఈ లోకం నడుస్తుంది.అప్పులతో, ఆర్థిక సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తగ్గి ధనవంతులు అవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత కష్ట పడినప్పటికీ ఆర్థిక సమస్యలు తీరని వారు కూడా ఉంటున్నారు.

అలాంటి వారు ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తొలగి ధనవంతులు అవుతారని జ్యోతిష్య పండితులు అంటున్నారు.ఉప్పంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమని వారు చెబుతున్నారు. చాలా మంది ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని చెబుతుంటారు. ఉప్పును ఉపయోగించి మనం సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా చేయవచ్చు. దీని కోసం ఒక కుండలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో మనం సంపాదించిన డబ్బును ఉంచాలి. ఈ విధంగా డబ్బును ఒక రోజంతా ఉంచి మరుసటి రోజూ బీరువాలో ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ డబ్బుకు ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు..

మనల్ని చూసి ఈర్ష్య తో కుళ్ళుకొనే వారి దిష్టి కూడా తగ్గుతుందట.నెగెటివ్ ఎనర్జీ తొలగి లక్ష్మీ దేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుందట. అలాగే మంగళ వారం రాత్రి పూట ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ల ఉప్పును ఉంచి మూట కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. మరుసటి రోజు అనగా బుధవారం ఆ మూట విప్పి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేసిన వారికి ఆ వారమంతా పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు చెబుతున్నారు. ఉప్పుతో ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుందని.. రుణ బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. మీరు కూడా ఒకసారి ఇలా చెయ్యండి..ధనలాభం పొందండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version