ఆ పొరపాటే స్టార్ హీరోయిన్ గా.. ఈ ముద్దుగుమ్మను ఎదగనీయకుండా చేసిందా..!!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల రాక్షసి సినిమాతో మొదటి సారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఎంతోమంది కుర్రకారులను తన వైపు లాక్కుంది. మిస్ ఉత్తరకాండ గా గుర్తింపు పొందింది ఆ గుర్తింపు తోనే మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. 2008లో అందాలరాశి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది.కానీ ఈమె నటించిన ప్రతి సినిమా కూడా సక్సెస్ సాధించలేకపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోవడం తో పలు అవకాశాలు కూడా అంతంత మాత్రానే వెలువడ్డాయి. ఇక తాజాగా సినిమాలకి దూరంగా ఉంటూనే పలు సోషల్ మీడియాకు మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది. తనకి ఖాళీ ఉన్న సమయాలలో సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అభిమానులను బాగా అలరిస్తూ ఉంటుంది.ఈమధ్య సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ చిల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడానికి ముఖ్య కారణం రోటీన్ కథ లలో ఉండే పాత్రలు ఎంచుకోవడమే అన్నట్లుగా తెలుస్తోంది. ఆమె చేసిన ఈ పొరపాటు వల్ల ఈమెకు వరస ప్లాపుల్లో వెలుబడ్డాయి. ఇక ఎట్టకేలకు ఇటీవలే ఒక స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో హ్యాపీ బర్తడే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఈ సినిమా ద్వారా తనకు మంచి విజయాన్ని చేకూర్చారు..కాకపోతే ఆమె కెరియర్ ఇంతటితో ముగిసి పోతుంది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా గతంలో మంచి సినిమాలలో నటించినా లావణ్యత్రిపాఠి ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో ఆమె అభిమానులు సైతం చాలా బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version