వినాయక చవితి రోజున ఇంట్లో ఇలాంటి గణపతిని ప్రతిష్టిస్తే దోషాలు మాయం

-

వినాయక చవితి వచ్చిందంటే.. పిల్లాపెద్దలకు పండుగేపండుగ. అందరూ సంతోషంగా గణేశ్ ఉత్సవాల్లో పాల్గొంటారు. కొందరు మండపాలు ఏర్పాటు చేసి వినాయకులను ప్రతిష్టిస్తే.. మరికొందరు తమ ఇళ్లలో గణపతిని తీసుకొచ్చి పూజిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో లాంటి వినాయకుడి ప్రతిమ నచ్చుతుంది. భక్తుల అభీష్టం మేరకే మార్కెట్​లోనూ రకరకాల గణపతి విగ్రహాలు దొరుకుతాయి. ఒక్కో వినాయకుడి ప్రతిమకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరి ఆ ప్రత్యేకతలేంటి.. ఎలాంటి వినాయకుడిని ప్రతిష్టిస్తే ఏం జరుగుతుంది తెలుసుకుందామా..?

తొండం ఎడమ వైపు ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేస్తే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఏపని మొదలెట్టినా విజయం తథ్యమని పురాణాలు చెబుతున్నాయి.

అదే కుడివైపు తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కోరుకునే కోరికలన్నీ నెరవేరతాయట. అయితే ఈ విగ్రహాన్ని పూజించేటప్పుడు నిష్టగా నియమనిబంధనలు పాటించాలట. లేకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. తొండం మధ్యలో ఉంటే గణపతిని ఇంట్లో ప్రతిష్టించి పూజ చేస్తే దుష్టశక్తుల ప్రభావం తగ్గి ఇళ్లంతా పాజిటివ్ వైబ్స్​తో నిండుతుందట.

తెల్లని రంగులో ఉండే గణేషుని విగ్రహాన్ని పూజించే ఇంట్లో శాంతి ఉంటుంది. తెలుపు రంగులో ఉండే గణపతికి పూజ చేస్తే ఇంట్లో కలహాలు ఉండవట. రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.

వెండి గణేషుణ్ని పూజిస్తే పేరు ప్రఖ్యాతులు, చెక్క రూపంలో ఉన్న గణేషుణ్ని పూజిస్తే ఆరోగ్యం, ఇత్తడి గణేషున్ని పూజిస్తే సంతోషం, మట్టి గణపతిని పూజిస్తే కెరీర్‌లో సక్సెస్ అవుతారని పండితులు చెబుతున్నారు.

మన ఇంట్లో నిత్యం చేసుకొనే పూజలకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి వంటి వ్రతాలు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది. ఎంతపెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూపదీప నైవేద్యములు జరగాలి అందుకే సాధారణంగా ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది. సిద్ధివినాయక పూజలో వాడే విగ్రహం మట్టితో చేసినదైతే శ్రేష్ఠం. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వంటి విగ్రహాలు వాడకూడదు. పూజలో మట్టి విగ్రహం గానీ, పంచలోహములతో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version