వినాయకుడికి ఉన్న మొత్తం పేర్లెన్నో, అవేమిటో తెలుసా..?

-

వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. కానీ ఇంకా మనకు తెలియని వినాయకుడి పేర్లు చాలానే ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా వినాయకుడు పలుకుతాడు.

వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. కానీ ఇంకా మనకు తెలియని వినాయకుడి పేర్లు చాలానే ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా వినాయకుడు పలుకుతాడు. భక్తుల మొరను ఆలకిస్తాడు. భక్తులు తాము చేయబోయే పనులు నిర్విఘ్నంగా పూర్తి కావాలని ముందుగా వినాయకుడికి పూజలు చేస్తారు. అయితే వినాయకున్ని మనం ఏ పేరుతో అయినా పిలవవచ్చు. ఆయనకు మొత్తం 32 భిన్నమైన పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బాల గణపతి
2. భక్తి గణపతి
3. ధుంధి గణపతి
4. దుర్గా గణపతి
5. ద్విజ గణపతి
6. ద్విముఖ గణపతి
7. ఏకదంత గణపతి
8. ఏకాక్షర గణపతి
9. హరిద్ర గణపతి
10. హీరాంబ గణపతి
11. క్షిప్ర గణపతి
12. క్షిప్ర ప్రసాద గణపతి
13. లక్ష్మీ గణపతి
14. మహా గణపతి
15. నృత్య గణపతి
16. రుణమోచన గణపతి
17. సంకటహర గణపతి
18. శక్తి గణపతి
19. సిద్ధి గణపతి
20. సింహ గణపతి
21. సృష్టి గణపతి
22. తరుణ గణపతి
23. త్రిముఖ గణపతి
24. త్య్రక్షర గణపతి
25. ఉచ్ఛిష్ట గణపతి
26. ఉద్దండ గణపతి
27. ఊర్ధ గణపతి
28. వరద గణపతి
29. విఘ్న గణపతి
30. విజయ గణపతి
31. వీర గణపతి
32. యోగ గణపతి

అయితే వినాయకున్ని 32 పేర్లతో కొలిచినా.. భక్తులు మాత్రం ఆయనకు ఈ కింది ఇచ్చిన మరో 10 పేర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అవేమిటంటే…

1. ఏకదంత (ఒక్కటే దంతం ఉన్నవాడు)
2. లంబోదర (కుండలాంటి పొట్ట కలవాడు)
3. విఘ్ననాశ లేదా విఘ్నేశ్వరుడు (పనుల్లో అవరోధాలు ఏర్పడకుండా చూసేవాడు)
4. వినాయక (అన్ని నాయకత్వ లక్షణాలున్న నాయకుడు)
5. గణనాథుడు (అన్ని గణాలకు అధిపతి)
6. గజానన (ఏనుగు లాంటి ముఖం కలవాడు)
7. దేవదేవ (అందరు దేవుళ్లకు దేవుడు)
8. ఓంకార (సరైన జీవితాన్ని ఇచ్చేవాడు)
9. అద్వైత (ఏకైక వ్యక్తిత్వం ఉన్నవాడు)
10. అవనీషుడు (ప్రపంచాన్ని ఏలే వాడు)

Read more RELATED
Recommended to you

Exit mobile version