పసిడి ప్రియులకు శుభవార్త. నిన్న భారీగా పెరిగిన ధర.. ఇవాళ అమాంతం పడిపోయింది. భారీగా పడిపోయిన బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర మరింత పడిపోయింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 120 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 56,240కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది.
10 గ్రాముల ధర రూ. 110 తగ్గడంతో రూ. 51,560కు చేరుకుంది. అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 3000 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 68,100కు చేరింది. బంగారం ధర ఔన్స్ కు 2 వేల డాలర్ల కిందకి పడిపోయింది. ఇక బంగారం బాటలోనే నడిచిన వెండి ధర ఔన్స్ కు 27 డాలర్ల దాకా పడిపోయింది.