మనం రోజు దేవుడికి పూజ చేస్తూ ఉంటాం. అయితే దేవుడికి పూజ చేసేటప్పుడు కుంకుమ, పసుపు వంటి పూజ సామాన్లతో పాటుగా పుష్పాలతో కూడా పూజ చేస్తూ ఉంటాం. అయితే పుష్పాలతో పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలని వాస్తు పండితులు అంటున్నారు.
మనం ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు పువ్వులతో పూజ చేస్తాం. అయితే ఈ పూలు సాధారణంగా ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన పూలని త్వరగా తొలగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే పూజ చేసిన తర్వాత ఎండిపోయిన పువ్వులను తీయరు.
అలా తీయకుండా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని వాస్తు పండితులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు మీరు తాజా పూలు పెట్టడం.. వాడిపోయిన పూలను తొలగించాలి. ఎండిపోయిన పూలని దేవుడు ముందు ఉంచడం మంచిది కాదని దీని వల్ల సమస్యలు వస్తాయని పాజిటివ్ ఎనర్జీ ఉండదని పండితులు చెబుతున్నారు.
కాబట్టి పూజ మందిరం నుంచి త్వరగా వాటిని తొలగించాలి. అలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీనితో ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండచ్చు.