శబరిమలలో పదునెట్టాంబడిని ఎవరు నిర్మించారో తెలుసా ?

-

కార్తీకం నుంచి మొదలైన అయ్యప్ప శరణుఘోషలు దేశమంతా మారుమ్రోగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో అయితే అయ్యప్పమాలలు వేసేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇక మకరసంక్రాతి దగ్గరపడుతున్న కొద్ది శబరిమలై దర్శించేవారి సంఖ్య కూడా అత్యధికంగా పెరుగుతుంది. అయితే శబరిమలలో స్వామి సన్నిధిలోని 18 పవిత్ర మెట్లు అత్యధికంగా పేరుగాంచాయి. అయితే ఈ పవిత్రమైన మెట్లను పదునెట్టాంబడి అని అంటారు. అయితే వీటిని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం….

పదునెట్టాంబడి (18 మెట్లు) – స్వామి సన్నిధానంలో ఉండే 18 మెట్లను పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులు ఎనిమిది మంది (ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు), రెండు యోగములు (కర్మయోగం, జ్ఞానయోగం), విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పరచారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కేముందు కొబ్బరికాయను కొట్టి ఆ నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత మాలిగై పుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలు దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుబడిగా చెల్లించుకుంటారు. ప్రతి ఏటా నవంబర్ మధ్య నుంచి జనవరి వరకు శబరిమలై భక్తకోటితో పులకించిపోతోంది.

రెండున్నరమాసాల పాటు దేశంయావత్తు, మరీ ముఖ్యంగా దక్షిణభారతం శరణుఘోషతో మారుమ్రోగిపోతుంటోంది. ప్రతిరోజు సుమారు ఐదారులక్షల మంది అయ్యప్ప భక్తులు పంపానదితీరం నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు. అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే, పంపానది నుంచి సుమారు, 4,135 అడుగుల ఎత్తులో ఉన్న సన్నిధానంకు చేరాల్సిందే. ఈ మార్గమే మనోదౌర్భాల్యాలనీ , శారీరక సౌఖ్యాలనీ మండించి బూడిద చేయగల దైవమార్గం. ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలే ఆ హరిహరసుతుడు పెట్టే పరీక్షలు. వీటిలో నెగ్గితే మోక్షమార్గం కళ్లెదుట కనబడుతుంది.

ఇటీవల కాలంలో మాల వేసుకున్నవారే కాకుండా సాధారణ భక్తుల కూడా శబరిమల దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. జీవితాన్ని ఆధ్యాత్మికతతో ఆనందంగా మార్చుకుంటున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version