మీ పిల్లలు చెడ్డ మార్గంలో వెళ్తున్నారని అనుమానమా..? అయితే ఇలా కనిపెట్టేయండి..!

-

పిల్లల ప్రవర్తన ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కొంతమంది పిల్లలు కాస్త అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు చాలా నిశ్శబ్దంగా కూర్చుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి పిల్లలపై అనుమానం వస్తుంది. పిల్లలు మంచి వాళ్లేనా లేకపోతే మంచి బాటలోనే వెళ్తున్నారా ఇలా… మీకు కూడా ఇదే ప్రశ్న తరచు కలుగుతూ ఉంటున్నట్లయితే ఇలా తెలుసుకోవచ్చు. మీ పిల్లలు మంచి వాళ్ళా కాదా అనేది వీటి ద్వారా చూసి చెప్పచ్చు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులని కంగారు పెడుతున్న అంశం పిల్లల యొక్క ప్రవర్తన. పిల్లల్ని అతిగా ప్రేమించే తల్లిదండ్రులు వారు తప్పు చేస్తే తట్టుకోలేకపోతున్నారు.

 

సో వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు అనేది మీరే తెలుసుకోవాలి పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం కచ్చితంగా ఉండాలి. లేకపోతే మొండిగా మారిపోతారు కాబట్టి కచ్చితంగా పిల్లలకి భయం చెప్తూ ఉండండి వాళ్ళకి మీ మీద భయం లేకపోతే వాళ్లు కచ్చితంగా చెడ్డదారిలో వెళ్తుంటారు. పిల్లల్ని అతిగా గారాబం చేయడం కూడా మంచిది కాదు అడిగింది ప్రతీది ఇచ్చేయడం వంటివి చేయకూడదు క్రమశిక్షణ కచ్చితంగా నేర్పాలి లేకపోతే చెడు పనులు చేస్తూ ఉంటారు. మీ పిల్లలు కనక మిమ్మల్ని గౌరవించడం లేదు అంటే కచ్చితంగా వాళ్ళు తప్పు దారిలో వెళ్తున్నారు ఈ విషయం మీరు కచ్చితంగా గ్రహించాలి ఈ ప్రవర్తన అలవాటైపోవచ్చు జాగ్రత్తగా ఉండండి.

వాళ్ళని మంచి దారిలోకి మార్చండి. మీ పిల్లలు తప్పుదారిలో వెళ్తున్నారంటే చాక్లెట్లు బిస్కెట్లు బొమ్మలు ఇలా వాళ్ల కోసం ఏం తెచ్చినా కూడా వాళ్ళలో ఆనందం ఉండదు దానికి మించి అడుగుతారు. చెడ్డదారిలో వెళ్లే పిల్లలకి సుప్రియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళ మాటే నెగ్గాలని అంటూ ఉంటారు అందుకోసం ఇతర పిల్లలపై దాడులకు కూడా దిగుతారు. అలానే మీ పిల్లల ఆట తీరును బట్టి కూడా మీరు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. వాటిలో ఓడిపోతే వాళ్ళు అసలు సహించలేరు ఏడుస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఇతరుల మీద దాడి కూడా చేస్తూ ఉంటారు. పిల్లల్ని ప్రతిసారి ప్రశంసించకండి. ఏదైనా పెద్దది సాధిస్తేనే బహుమతి ఇవ్వండి గెలుపు ఓటమి అంటే ఏంటో నేర్పించండి. ఎలా ఇతరులను గౌరవించాలో చెప్పండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version