హిందువులు కేవలం దేవుని విగ్రహాలను పూజించడం మాత్రమే కాకుండా చెట్లు, నదులు వంటి మొదలైన వాటిని కూడా దైవంగా భావిస్తారు. సహజంగా చాలా శాతం మంది ప్రవహించే నదులలో నాణేలను వేస్తూ ఉంటారు. రూపాయి, రెండు రూపాయలు లేదా ఐదు, పది రూపాయల నాణేలను వేయడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుందని భావిస్తారు. పౌరాణిక సాంప్రదాయం ప్రకారం పురాతన కాలం నుండి ఈ పద్ధతిని చాలా శాతం మంది పాటిస్తూ వచ్చారు. నదిని తల్లిగా భావించి ఆమెకు బహుమతిగా నాణేలను సమర్పించడంగా భావిస్తారు. అయితే కేవలం నది స్నానం చేసినప్పుడు మాత్రమే కాకుండా ప్రవహించే నదులలో నాణేలను వేస్తూ ఉంటారు.
ఇలా చేయడం వలన కుటుంబ సభ్యులలో ఆనందం, శ్రేయస్సు మరియు సంపద పెరుగుతుంది అని నమ్ముతారు. అయితే దీని వెనుక విజ్ఞాన శాస్త్రంతో కూడా సంబంధం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. సైన్స్ ప్రకారం, నదిలో నాణేలను వేయడం అనేది నీటిని శుభ్రం చేయడానికి. పురాతన కాలంలో నాణేలు రాగితో తయారు చేయబడినవి. ఎప్పుడైతే రాగితో తయారు చేసిన నాణేలను నీటిలో వేస్తారో అవి నదిలో కరిగిపోతాయి. అందువలన రాగి నాణేలను నీటిలో వేస్తె నీరు శుభ్రంగా మారుతుందని చెబుతారు.
ఈ విధంగా నీరుని శుభ్రంగా ఉంచడానికి పూర్వకాలంలో నాణేలను నీటిలో వేసేవారు అని చెబుతారు. అంతేకాకుండా నదిలో నాణేలను వేయడం వలన సూర్యుడు స్థానం బలంగా పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహాలకి రాజు అయిన సూర్యుడు ఆశీస్సులు పెరగాలంటే నదిలో నాణేలను వేయాలి అని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా చేస్తే శరీరంలో శక్తి ప్రవాహానికి కూడా మేలు చేస్తుంది. అందువలన ఇది కేవలం మూఢ నమ్మకం కాదని దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు.