తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలెర్ట్. తెలంగాణలో వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న మూడు రోజుల్లో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ అలాగే సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.