వాస్తు: అనారోగ్య సమస్యలు తగ్గడం లేదు అంటే ఈ తప్పులు చేశారేమో చూడండి…!

వాస్తు దోషం కారణంగా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ వాస్తు తప్పులు చేసారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ తప్పులు చేస్తే సరిదిద్దుకోండి. అప్పుడు సమస్యలు తొలగిపోతాయి. మరి వాస్తు పండితులు చెబుతున్న ఈ విషయాలని ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తిగా చూడండి.

 

ఒకవేళ కనుక మీ ఇంటి ముఖద్వారం దగ్గర గొయ్యి ఉంటే దానిని పూడ్చేయడం మంచిది. ఈ తప్పు కనుక చేసారు అంటే ఇంటి యజమాని లేదా ఇతర కుటుంబ సభ్యులకి శారీరకంగా లేదా మానసికంగా సమస్యలు వస్తాయి.

అదే విధంగా ఎప్పుడూ కూడా ముఖద్వారం దగ్గర శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముఖద్వారం దగ్గర చెత్తాచెదారం ఉండడం వల్ల కూడా వాస్తు దోషం ఉంటుంది.

అలానే ఇంట్లో మధ్య ప్రదేశం లో బ్రహ్మ స్థానం ఉంటుంది. పూర్వం రోజుల్లో ఇంటి మధ్యలో కోర్ట్ యార్డ్ లాగ ఉంచుకునేవారు. కానీ ఈ రోజుల్లో అది అసంభవం. కనుక ఇంటి మధ్య ప్రదేశం లో కనుక బరువులు వంటివి ఉంటే తొలగించడం మంచిది. దీని వల్ల వాస్తు దోషం తొలగుతుంది.

అదే విధంగా వాయవ్యం వైపు దేవుళ్ళని పెట్టాలి. ఆ చోట కనుక టాయిలెట్ లేదా మెట్లు ఉంటే అది వాస్తు తప్పు. దీని కారణంగా కూడా మానసిక సమస్యలు ఇంటి యజమానికి లేదా ఇతర కుటుంబ సభ్యులకి వచ్చే అవకాశం ఉంది. దీనితో ఇంట్లో సమస్యలు వస్తాయి గమనించండి.