మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎల్లలు దాటినా.. పుట్టిన ఊరును,కన్న తల్లితండ్రలను పట్టించుకోవాలంటారు.. వీటితో పాటు.. మీ కులదైవాన్ని కూడా యాదుంచుకోవాలి. కులదైవాన్ని విస్మరిస్తే..మీరు ఏ దిక్కున ఉన్న ఆ అమ్మ ఆగ్రహానికి బలైపోవాల్సిందే అంటున్నారు కొందరు.. కోరికలు సిద్ధింపజేసే కులదైవాన్ని విస్మరిస్తే కలిగే నష్టాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
చాలా మందికి ఇంటి దేవతలుగా గ్రామ దేవతల వంటి వారే ఉంటారు. కొద్ది మందికి మాత్రం పురాణ దేవతలు కూడా కులదైవాలుగా ఉంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు కులదైవాలుగా ఉంటే మరి కొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు ఇంటి దేవుళ్లుగా ఉంటారు. గృహంలో జరిగే ఏ శుభకార్యంలోనైనా గృహస్థులు ఈ దేవతలకు ప్రాధాన్యతను ఇచ్చి మొదట పూజించి తర్వాత ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీ. కుటుంబంలో సుఖ శాంతులు నిలిచి ఉండాలని పూర్వీకుల నుంచి కూడా కులదేవతారాధన చేస్తూ వచ్చారు. కుల దైవం కుటుంబాన్ని కాపాడుతుంది.
కులదైవాన్ని మరిస్తే…
కులదైవాన్ని మరిస్తే కుటుంబం చుట్టూ ఆవరించి ఉన్న దైవ శక్తి రక్షణ చక్రం కనుమరుగవుతుంది. దీని కారణంగా ప్రమాదాలు, ప్రతికూల శక్తుల విజృంబణ, అనారోగ్య సమస్యలు వస్తాయి.. రకరకాల అడ్డంకులతో కుటుంబ పురోగతి దిగజారుతుంది. కుటుంబంలో సంస్కారం క్షీణించడం, అనైతికత, అసమ్మతి, అశాంతి చెలరేగుతాయి. గ్రహచారం బాగున్నా కుటుంబంలో సంక్షేమం ఉండదు.
కులదైవారాధన తప్పనిసరి
కులదైవానికి సముచిత స్థానం ఇవ్వక పోయినా, సరైన గౌరవం దక్కకపోయినా, సరైన రీతిలో ఆరాధించకపోయినా వారి శక్తి నశించి కుటుంబం కుంటుపడుతుంది. అలా జరిగితే మీరు ఏ దేవతారాధన చేసినా కూడా అది వారికి చేరదట. బయటి నుంచి వచ్చే దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు చాలా సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
ప్రతి సంవత్సరం చెయ్యాలి
ప్రతి కుంటుంబానికి వారి కుల దైవానికి సంబంధించిన ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించి ఏడాదిలో ఒకసారి లేదా రెండు సార్లు ప్రత్యేకమైన రోజులలో కులదైవారాధాన ప్రత్యేకంగా చేస్తారు. ఇది కాకుండా శుభకార్యాల సమయంలో తప్పకుండా కుల దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది.
కులదేవతరాధన చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు..
కులదేవతను విస్మరిస్తే జన్మ జాతకాల్లో దోషాలు ఏర్పడుతాయి. మంచి గ్రహ రాశులు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి.
తల్లిదండ్రులను, కుల దైవాన్ని పూజించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. వారి ఆశీర్వాదం లేకుండా ఇంకెలాంటి ఆశీర్వాదం లభించదు.
కులదేవతారాధన విస్మరించిన కుటుంబంలో నిరంతరం ఏదో ఒకరకమైన కలతలు వేధిస్తూ ఉంటాయి.
పరిసరాల్లో ఉండే వ్యక్తులతో కూడా అనవసరపు స్పర్థలు ఏర్పడుతాయి.
పిల్లలతో, తల్లిదండ్రులకు సరైన సయోధ్య లేక నిరంతరం ఇంట్లో వేదనా భరిత వాతావరణం ఉంటుంది.
ఏదో ఒక కారణంతో భార్యాభర్తల మధ్య విబేధాలు చేలరేగి వారి మధ్య ఆనందం లేకుండా పోతుంది.
ఈ కాలంలో కూడా ఇవన్నీ ఎవరు నమ్ముతారు అని లైట్ తీసుకునేవాళ్లు ఉండొచ్చు.. నమ్మకం ఉన్న వారు మాత్రం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది.. మీ ఇంట్లో కారణం లేకుండా నిరంతరం ఏదో ఒక చికాకు వెంటాడుతుంటే.. ఈ దిశగా ఆలోచించి చూడమని పండితులు సూచిస్తున్నారు.