పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో కచ్చితంగా జరిగే ఒక ప్రక్రియ. ఇది పూర్తిగా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే.. మీ జీవితంలో వచ్చే ఆ వ్యక్తి వల్ల మొత్తం మీ లైఫ్ మారిపోతుంది. అది ఎలా ఉండాలో.. వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకైనా అంతే.. కట్టుకున్న భార్య మనస్తత్వం, ఆ ప్రవర్తతన, క్యారెక్టర్ మీకు నచ్చకుంటే.. ప్రశాంతంగా బతకగలరా..? విడాకులు తీసుకుంటే.. ఏదీ మునపటిలా ఉండదు. అమ్మాయిల విషయంలోనూ ఇదే జరుగుతుంది. అయితే పెళ్లి చేసుకునే ముందు.. చాలా విషయాలు ఆలోచిస్తారు. అందులో ముఖ్యంగా అమ్మాయిల జాతకం.. రాశి, నక్షత్రం, పుట్టినతేదీ కచ్చితంగా ఉంటాయి. జనాల్లో అందరికీ.. ఒక అపోహ ఉంటుంది. మూలానక్షత్రంలో పుట్టిన మహిళను పెళ్లి చేసుకోకూడదు. అలాంటి వాళ్లను చేసుకుంటే.. అన్నీ కష్టాలే అని..! ఇందులో వాస్తవమెంత ఉంది..? దీనిపై పండితులు ఏం అంటున్నారు.
శాస్త్రపరంగా చూస్తే మూల నక్షత్రంలో పుట్టిన మహిళను పెళ్లి చేసుకుంటే అంతా అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. కానీ చాలా మంది మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. నిజానికి అలాంటివేమీ జరగవు. ఒకవేళ కనుక సమస్యలు వస్తున్నాయి అంటే అమ్మాయి పుట్టినప్పటి నుండి కూడా సమస్యలు రావాలి. పైగా పుట్టిన వాళ్లకి కూడా ఎన్నో ఇబ్బందులు కలిగి ఉండాలి. కానీ ఇవన్నీ అపోహలు కనుక అలా జరగదు. ఇటువంటివి అనవసరంగా నమ్మద్దు.
మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వైవాహిక జీవితంలో ఆనందంగా సాగుతున్న వాళ్లు కూడా ఉన్నారు. చాలామంది ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి అదృష్టాన్ని చేతులారా నాశనం చేసుకోకండని పండితులు అంటున్నారు. మూల, ఆరుద్ర, జేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే సమస్యలు వస్తాయని అంటుంటారు కానీ అవేమీ నిజం కాదు ఈ నక్షత్రాలలో పుట్టిన వాళ్లు ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉంటారు.