మట్టి కుండను ఈ దిక్కున ఎందుకు పెట్టాలో తెలుసా?

-

వాస్తు శాస్త్రంలో కొన్ని నమ్మశక్యం కాని నిజాలు ఉంటాయి. అవును, ఏ వస్తువైనా ఏ దిక్కున పెట్టాలో ఆచరించాల్సి ఉంటుంది. అవి ఆశ్యర్యాన్ని కలిగిస్తాయి కూడా. ఇప్పుడు కూడా అలాంటి నమ్మశక్యం కానీ, వాస్తు శాస్త్రం నియమం తెలుసుకుందాం. ఇంట్లో మనం సాధారణంగా చల్లటి మట్టికుండను వాడతాం. ముఖ్యంగా ఎండాకాలంలో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివని కొని తెచ్చుకుంటాం. అయితే,


వాస్తు శాస్త్రం ప్రకారం తాగునీటి కుండను ఈ దిక్కున పెడితే మంచిదని అంటారు. అయితే, ఆ దిశగా ఎందుకు పెట్టాలో తెలుసుకుందాం. ఇంట్లో ఉండే మంచినీటి కుండను సరైన దిశలో పెట్టాలి. వాస్తుశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాలు ప్రకారం ఉత్తరం దిశలో మంచినీటి మట్టికుండను పెట్టాలి. ఈ దిశలో నీటిని నింపిన మట్టికుండను పెడితే సంపదలు కలిసివస్తాయని తెలిపారు. ఉత్తర దిశలో ఇలా మట్టికుండను పెడితే వరుణ దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులపై ఉంటుందట. అదేవిధంగా వారిలో ఉండే భయాందోళనలు తొలగిస్తుంది. అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసుకునే బలం వారికి కలుగుతుంది. దీనివల్ల కుటుంబంలో ఉండే నడుమలో పుట్టిన కుమారుడికి లాభం చేకూరుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కూడా వినికిడి స్థాయిని పెంచుతుంది. అందుకే ఉత్తరం దిశగా మంచినీటి మట్టికుండను పెట్టుకుని ఆ వరుణ దేవుని అనుగ్రహం పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news