తల్లిదండ్రులు కోపంలో పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా..?

-

కోపం వచ్చినప్పుడు మనిషి ఆలోచించే శక్తిని కోల్పోతాడు. ఆవేశంలో నోటికి ఏది వస్తే అది మాట్లేడేస్తాడు. దానివల్ల చాలా బంధాలు తెగిపోతాయి, మనస్పర్ధలు వస్తాయి. అరే ఏదో కోపంలో అన్నాను లైట్‌ తీసుకో అని మీరు అంటారు.. కానీ ఎంత కోపం వచ్చినా.. మీ మనసులో ఆ ఫీలింగ్‌ ఉంది కాబట్టే మీరు అన్నారు అని అవతలి వాళ్లు ఫిక్స్‌ అయిపోతారు. అలాగే కోపంలో బూతులు తిడతారు, శాపనార్థాలు పెడతారు.. ఇవన్నీ వాళ్లకి తగులుతాయా..? ముఖ్యంగా తల్లిదండ్రులు కోపంలో పిల్లలను తిడితే.. ఆ తిట్లు వాళ్లకి తగులుతాయా..? దీనిపై పండితులు ఏం అంటున్నారు.

జ్ఞానంతో తిట్టినా, అజ్ఞానంతో తిట్టినప్పటికి ఆ వాక్కు ఫలిస్తుంది. అందువల్లనే పాతకాలంలో అమ్మమ్మలు, బామ్మలు వంటివారి నోటి నుండి ఒక్కమాట కూడా అపశబ్ధం వచ్చేది కాదట. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఏం చేస్తున్నామో తెలియదు. ఎవరిని తిడుతున్నామో కూడా తెలియదు. ఎవరిని శపించే స్థాయికి మీ కోపం వెళ్తుందో మనసుకు, బుద్ధికి తెలియదు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై కోపం వచ్చినపుడు తిడుతూ, శాపనార్ధాలు పెడుతుంటారు.

అయితే ఏ తల్లిదండ్రులు కూడా తమ పిలల్లని మనస్పూర్తిగా దూషించరు, శపించరు. కోపంలో పిల్లలను, తిట్టడం, శపించడం అనేది ఆ క్షణానికి జరుగుతుంది. అవి మనస్పూర్తిగా వచ్చినవి కానప్పటికీ, ఆ తిట్లు, శాపనార్ధాలు ఫలిస్తాయట. పిల్లలు తప్పు చేసినపుడు ఎప్పుడైనా సరే మందలించాలి. కోపంతో కళ్ళతో మందలించాలి. అవసరం అయితే నాలుగు తగిలించండి. అంతేకానీ.. పిల్లలను తిట్టడం, శాపనార్థాలు పెట్టడం వంటివి అస్సలు చేయకండి. కనిపెంచిన తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. .మరి అలాంటి దేవుళ్లు నోట్లోంచి వచ్చే మాటలు తప్పక ఫలిస్తాయి. కడుపునపుట్టిన వాళ్లను కోపంలో ఏదో ఒకటి మీరు అనేస్తే..దాని ప్రభావం వాళ్ల మీద పడుతుంది. కాబట్టి ఏమి అనకూడదు. ఎంత కోపం ఉన్నప్పటికీ, నోటితో మాత్రం తిట్టడం, శపించడం లాంటివి చేయకూడదు. వాక్కు ఆత్మశక్తి ద్వారా ప్రచోదితం అయ్యి బయటికి వస్తుంది. కాబట్టి ఫలించే అవకాశం ఉంటుందని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version