బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపైనే సంచలన కామెంట్స్ చేశారు.గురువారం వీడియో సందేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు. అంతేకాకుండా, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే బీజేపీలోని పాత వాళ్లను వెంటనే బయటకు పంపాలని వ్యాఖ్యానించారు.
బీజేపీ అధిష్టానం దీనిపై ఆలోచన చేయాలని కోరారు.తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే..ఆ సీఎంతో తమ పార్టీలోని కొందరు నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. వారికి రిటైర్మెంట్ ఇస్తేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు.