చనిపోయిన వ్యక్తి కలలో ఏడుస్తూ కనిపిస్తే ఏంటి సంకేతం..?

-

కలలు ఒక వ్యక్తిని పరిపరివిధాలుగా ఆలోచింపజేసేలా చేస్తాయి. ఇవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు అని కొందరు అంటారు. భవిష్యత్తుకు సంకేతాలు అని కొందరు అంటారు. కలలో కనిపించే వ్యక్తులు, వస్తువులతో మీకు ఏదో ఒక సంబంధం ఉంటుంది. అవి ఏవో చెప్పాలని అనుకుంటున్నాయి అందుకే కలల రూపంలో మీకు అలా కనిపిస్తాయని స్వప్నశాస్త్రం చెప్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు మీ కలలో కనిపించి ఏడుస్తున్నారంటే దాని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం.

చనిపోయిన వ్యక్తి ఒక కలలో కనిపిస్తే, అది కూడా అతను వెక్కి వెక్కి ఏడిస్తే లేదా చాలా కోపంగా కనిపిస్తే, అతను మీకు ఏదో సిగ్నల్ ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మీరు బహుశా మీ కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి నచ్చని పనిని చేస్తున్నారు, అందుకే అతను ఏడుస్తున్నాడు లేదా కోపంగా ఉన్నాడని అర్థం.

ఇలాంటి కలకు అర్థం అతను లేదా ఆమె మిమ్మల్ని ఈ పని నుండి ఆపాలనుకుంటున్నాడు, ఆ పనిలో మీరు నష్టపోతారని అతను భయపడతాడు. అదే మీకు చెప్పదలచుకుంటున్నాడు.

మీరు కలలో చనిపోయిన వ్యక్తితో మాట్లాడినట్లయితే, ఆ కల మంచి విషయాలను సూచిస్తుంది. డ్రీమ్ బుక్ ప్రకారం, ఈ కల రాబోయే రోజుల్లో కొన్ని పనులు పూర్తి కాబోతున్నాయని సూచిస్తుందట.

చనిపోయిన వ్యక్తి కలలో కనిపించి ఏదైనా తింటూ ఉంటే.. అతను ఏదైతే తిన్నాడో వాటిని మరుసటి రోజు దానం చేస్తే అవి వారికి చేరతాయని పండితులు అంటారు. అంటే కలలో మీకు చనిపోయిన వ్యక్తి కనిపించే అన్నం తిన్నారనుకోండి. మరుసటి రోజు మీరు ఎవరికైనా భోజనం పెట్టండి, కూరగాయలు కనిపిస్తే వాటిని దానం చేయండి.!

పగలంతా ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత హ్యాపీగా ఉన్నా రాత్రి నిద్రపోయే ముందు ఆ బెడ్‌ మీద పడుకోగానే.. ఏవేవో ఆలోచనలు మిమ్మల్నికట్టిపడేస్తాయి. ఈరోజుల్లో ఎవరూ వందశాతం వారి జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం లేదు. రెస్ట్‌ లేదు, ఏదో సాధించాలనే తపన. ఆ ఆలోచనలే మీకు కలల రూపంలో ప్రతిబంబిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version