పీరియడ్స్ లో.. అమ్మాయిలూ ఈ తప్పులు చెయ్యద్దు..!

-

పీరియడ్స్ లో చాలామంది ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. మహిళలూ పీరియడ్స్ సమయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. పీరియడ్స్ సమయంలో మరి ఇక ఎలాంటి పొరపాట్లను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి మహిళలూ వీటిని చూసి, ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి. లేకపోతే అనవసరంగా మీరే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో శరీరాన్ని తలకిందులు చేసే యోగాసనాలు వేయకూడదు. యోగాసనాల్లోని కొన్ని వేస్తే అనవసరంగా ఇబ్బంది పడాలి. పీరియడ్స్ లక్షణాలని మరింత తీవ్రతరం చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వర్కౌట్స్ చేస్తే కూడా మంచిది కాదు. ఇంటెన్స్ ఆక్టివిటీ చేయకూడదు ఇలా చేస్తే శరీరంలో అడ్రనలీన్ హార్మోన్ పెరుగుతుంది. శరీరం రిలాక్స్ గా ఉండదు పొట్టపై ఒత్తిడి పడుతుంది దీంతో పొత్తికడుపులో నొప్పి నడుము నొప్పి వస్తుంది.

చాలామంది పీరియడ్స్ వచ్చేయ్ అంటే అలా మంచం మీద పడుకుని ఉంటూ ఉంటారు రోజంతా అలా నిద్రపోతే నొప్పి, తిమ్మిరి ఇంకా ఎక్కువ అవుతాయి. నడవడం, స్ట్రెచింగ్, బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే మంచిది. పీరియడ్స్ సమయంలో చాక్లెట్ క్రేవింగ్స్ ఉంటాయి పీరియడ్ లక్షణాలని ఇవి ఇంకా ఎక్కువ చేస్తాయి. ఈ టైంలో బర్గర్, పిజ్జా, చిప్స్. చాక్లెట్స్, ప్రాసెస్ ఫుడ్ వంటివి తీసుకోకండి పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి మహిళలూ ఈ తప్పులు అస్సలు పీరియడ్స్ టైం లో చేయకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version