హిందూ సాంప్రదాయంలో పూజలు ఆచారాలలో నైవేద్యం ఒక ముఖ్యమైన భాగం. దేవుడికి సమర్పించే నైవేద్యాలలో అరటిపండు,కొబ్బరికాయ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు వస్తువులు దాదాపు అన్ని హిందూ పూజలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.అయితే ఈ అరటిపండు కొబ్బరికాయ ఎందుకు అంత ముఖ్యమైనవి వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక,శాస్త్రీయ కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం..
అరటి పండు: హిందూ సంప్రదాయం లో అత్యంత పవిత్రమైన ఫలంగా పరిగణిస్తారు దీన్ని కదిళి ఫలం అని కూడా అంటారు.భగవంతుడికి సమర్పించడానికి ప్రకృతిలో ఎన్నో పండ్లు ఉన్న అరటి పండుని మాత్రమే ప్రత్యేకంగా భావిస్తారు కారణం.. ప్రతిపండు అందులో ఉండే విత్తనాలు తిని పారేయడం వల్ల మొలుస్తుంది మనం తిని పారేసిన విత్తనాలు ఎంగిలి పడతాయి, కావున వాటి నుంచి వచ్చే మొక్క ఫలాలను ఇచ్చిన అవి భగవంతుడికి సమర్పించడంలో నిషేధం.
అదే అరటిపండుకి బీజం ఉండదు.ఓ అరటి చెట్టు నాటితే దాని చుట్టూ ఎన్నో వందల చెట్లు వస్తాయి కానీ అరటి పండు నాటితే దాని నుంచి చెట్టు రాదు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు,గణపతి,లక్ష్మీదేవి వంటిదేవతలకు అరటిపండు సమర్పించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు. శాస్త్రీయంగా చుస్తే, అరటిపండు తేలికగా జీరమవుతుంది. దేవుడు కు నవేధ్యంగా సమర్పించి, మరలా మనం తీసుకున్న వెంటనే మనకి శక్తి అందుతుంది. అందుకే ఆధ్యాత్మికంగా చూసిన శాస్త్రీయ కోణంలో చూసిన అరటిపండు ఎంతో శ్రేయస్కరం.
కొబ్బరికాయ పవిత్రత సంపూర్ణతకు చిహ్నం : హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నైవేద్యాల్లో మరొకటిగా చెప్పుకునేది కొబ్బరికాయ దీనిని శ్రీఫలం అని కూడా అంటారు.దాదాపు అన్ని శుభకార్యలలో ఉపయోగిస్తారు. కొబ్బరికాయ సంపూర్ణత సమృద్ధి దైవిక శక్తికి చిహ్నంగా భావించబడుతుంది. దీని లక్ష్మీదేవి యొక్క ప్రతీకగా చూపుతారు. కొబ్బరికాయ కూడా నాటితే కొబ్బరి మొక్క రాదు మనం తిని పడేస్తే, మొక్క రాదు. కొబ్బరికాయలో జీవిత సత్యం దాగి ఉందని కొందరు అమ్ముతారు.
కొబ్బరికాయను మానవ శరీరంతో పోల్చి చెబుతారు. కొబ్బరిని మనసుకి నీటిని నిర్మలత్వానికి,పీచుని అహంకారానికి సంకేతాలుగా చెబుతారు. దేవుడి ఎదుట కొబ్బరికాయ కొట్టడం అనేది అహంకారాన్ని తొలగించి దేవుడికి మనసు సమర్పించడానికి సూచిస్తుంది. ఇక శాస్త్రీయ కోణంతో చూస్తే కొబ్బరినీళ్లు ఎలక్ట్రోలైట్స్ తో నిండి ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.దీని సమర్పించడం ద్వారా దేవుడికి స్వచ్ఛమైన నైవేద్యాలు సమర్పించి మరలా మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని భావిస్తారు.
అరటిపండు,కొబ్బరికాయ కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కాదు అవి హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక, శాస్త్రీయ విలువలు కలిగి ఉన్నాయి.అరటిపండు సమృద్ధి, శాంతిని సూచిస్తే కొబ్బరికాయ పవిత్రతను సంపూర్ణతను సూచిస్తుంది.ఇవి రెండూ కూడా దేవుడికి సమర్పించడం ద్వారా భక్తుడు తన శ్రద్ధ,భక్తిని దేవుని ఎదుట వ్యక్తపరిచినట్లుగా భావిస్తారు.