శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ మాసం ఎక్కువ పూజలకు ఉపవాసాలకు అంకితం చేయబడింది. ఆదివారం రోజున కొన్ని పనులు చేయడం వల్ల దోషాలు కలుగుతాయని సమస్యలు తలెత్తుతాయని పండితులు సూచిస్తున్నారు. మరి శ్రావణమాసంలోనూ నిషిద్ధమైన పనులను చేయడం వల్ల సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే మరి అలాంటి చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మాంసం సేవించడం: శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది. ముఖ్యంగా ఈ మాసంలో శాఖాహారానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆదివారం రోజున సూర్యదేవునికి ఎక్కువ కొలుస్తాము. మాంసాహారం సేవించడం ద్వారా ఆయన అనుగ్రహం కోల్పోయే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు నమ్ముతారు. సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రతీక, ఆయనకు ఎంతో ప్రీతీకరమైన ఆదివారం రోజున మాంసాహారం సేవించడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు. మాంసాహారం బదులుగా సాత్విక ఆహారం, శాఖాహారం తీసుకోవడం మంచిది.
జుట్టు గోళ్ళు కత్తిరించడం : ఆదివారం అంటే చాలు ఎంతోమంది సెలూన్ షాపులకి క్యూ కడతారు. అసలు ఆదివారం జుట్టు కత్తిరించుకోవడం లేదా గోర్లు కత్తిరించడం నిషిద్ధం. ఇది సూర్యదేవుడి శక్తిని తగ్గిస్తుంది. కుటుంబంలో అశాంతి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసంలో ఆదివారం రోజున జుట్టు గోళ్లు కత్తిరించడం లాంటి పనులు వాయిదా వేయాలని సూచిస్తున్నారు.
కోపంతో మాట్లాడటం నిషేధం : ఆదివారం సూర్యదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు సానుకూల దృక్పథంతో ఉండాలి. వాదనలు కోపంతో మాట్లాడటం ఇతరులను బాధ పెట్టడం లాంటి చర్యలకు దూరంగా ఉండాలి సూర్యదేవుడి అనుగ్రహం పొందడం కోసం, ఇతరులతో గొడవలు పడడం మానివేయాలి. శాంతియుతంగా భక్తితో ఈరోజు గడపడం ఎంతో ఉత్తమం.
ఆలస్యంగా నిద్రలేవడం : ఆదివారం అంటేనే ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆలస్యంగా నిద్ర లేవడం మనం గమనిస్తున్నాం. శ్రావణమాసం అందులో ఆదివారం రోజున ఆలస్యంగా నిద్రలేవడం సూర్య దేవుడి శక్తివంతమైన సమయాన్ని కోల్పోవడం. ఉదయం త్వరగా లేచి స్నానమాచరించి సూర్య భగవానుడికి నమస్కారం చేయడం వలన ఎన్నో ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈరోజు సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఆదిత్య హృదయం స్తోత్రం పటించడం వలన ఎంతో శక్తి వస్తుందని హిందూ శాస్త్రం చెబుతుంది.
ఇక శ్రావణ ఆదివారం ఎంతో పవిత్రమైన దినం, ఇది ఆధ్యాత్మికతను పెంపొందించడంలో తోడ్పడుతుంది. ఈరోజు నిశిద్ధమైన పనుల నివారించి సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాక ఈరోజు సూర్య భగవానుడికి పూజించి, ప్రదోషకాలంలో గుడిలో దీపారాధన చేయడ, ఆదిత్య హృదయం శ్రద్ధగా చదవడం వలన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని శాస్త్రం చెబుతుంది.