మానవ రూపం లో శివుడి విగ్రహం……..!

-

శివుడు నిరాకారుడు అని హిందూ మతం చెబుతోంది. కానీ,ఆ నిరాకార రూపుడు భక్తుల పూజలు అందుకోవడానికి శివ లింగం రూపం లో ఆలయాల్లో కొలువై వున్నాడని బావిస్తారు. అయితే శివుడు మనిషి రూపంలో ఉండటం ఎప్పుడైనా చూసారా? మానవాకారంలో పూజలు అందుకుంటూ ఉన్న శివుడు విగ్రహం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో గుడి మల్లం అనే గ్రామం లో ఉంది.

పురుషుడి అంగాన్ని పోలి ,7 అడుగుల ఎత్తు న ఉండే శిల్పం పై హిందువుల ఆరాధ్య దైవం శివుడు…ఈ ఆలయం చాలా పురాతన మైనది. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతికి 29 కి.మి . దూరంలో గుడి మల్లం దేవాలయం ఉంది. ఈ ఆలయం క్రీ. శ ఒకటవ శతాబ్దం లో దేవాలయం గా పురావస్తు శాఖ వారు గుర్తించారు. 2009 వరకు ఈ ఆలయంలో పూజలు జరిగేవి కావని, గ్రామస్తులు, రాస్ అనే స్వచ్ఛంద సంస్థ పోరాట ఫలితమే కేంద్ర ప్రభుత్వం పూజలకు అవకాశం కల్పించారు.

1911 లోనే ఈ ఆలయాన్ని వెలికి తీసిన ఒక దశాబ్ద కాలంగానే మూల విరాట్టు కు పూజలు జరుగుతున్నాయి. చోళులు, పల్లవులు పాలించే సమయంలో నిత్య పూజలతో తేజోవంతం గా ఉండేది.మళ్లీ ఇప్పుడు 2009 నుండి నిత్య పూజలతో కళకళ లాడుతుంది. పురావస్తు ఆధ్వర్యం లో ఉజ్జయిని లో జరిపిన తవ్వకాల్లో క్రీ.పు మూడో శతాబ్దం కాలం నాటి నాణేలు బయట పడ్డాయి అని, వాటిపై ఈ విగ్రహాన్ని పోలిన ముద్ర వుందని ఆలయ చైర్మన్ తెలిపారు.

అంటే ఈ ఆలయం కన్నా విగ్రహం రెండు దశాబ్ద కాలం ముందు నుండి ఉందని ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రధానంగా మూల విరాట్టు లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే విగ్రహం లో త్రిమూర్తులు రూపంలో ఆకారాలు మనకి దర్శనమిస్తాయి. ఈ ఆలయం సృష్టికి మూలం అంటారు. అందుకే పిల్లలు లేని వారు రాహు కాలంలో పూజలు చేసి, స్వామి అనుగ్రహం పొందుతారు ఇక్కడ ఆరు ముఖముల సుబ్రమణ్య స్వామి, సూర్యనారాయణ స్వామి వారి ఉపాలయాలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version