అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అన్నారు. 9 నెలలు అయింది.. సూపర్ సిక్ ఎక్కడ? అంటూ నిలదీశారు బొత్స సత్యనారాయణ. ప్రజల్ని మోసం చేయడం ధర్మం కాదని ఆగ్రహించారు. అసెంబ్లీ కి రావాల వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉందని వివరించారు బొత్స సత్యనారాయణ.